☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

తప్పిపోయిన షిరో.. ఎట్టకేలకు 20 కి.మీ. దూరంలో ఆచూకీ లభ్యం..! ఎలా దొరికిందో తెలుసా..?

పెంపుడు జంతువులు ఇంట్లోని ఒక సభ్యుడితో సమానం. అవి కొద్దిసేపు కనిపించకపోయినా ఆ కుటుంబం పడే వేదన వర్ణనాతీతం. సరిగ్గా అలాంటి సంఘటనే హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. అయితే ఒక మహిళా పోలీసు కానిస్టేబుల్ చూపిన చొరవ, సాంకేతికత సరైన వినియోగం వల్ల తప్పిపోయిన ఒక పెంపుడు కుక్క క్షేమంగా తన యజమాని ఒడికి చేరింది.
తప్పిపోయిన షిరో.. ఎట్టకేలకు 20 కి.మీ. దూరంలో ఆచూకీ లభ్యం..! ఎలా దొరికిందో తెలుసా..?

హైదరాబాద్‌లో ఓ పెంపుడు కుక్క అదృశ్యమవడంతో ఆ కుటుంబంలో ఆందోళన నెలకొంది. మధురానగర్‌ ప్రాంతానికి చెందిన షిరో అనే పెంపుడు కుక్క కనిపించకుండా పోవడంతో దాని యజమాని నగరంలోని పలు ప్రాంతాల్లో వెతికారు. అయినా ఆచూకీ లభించకపోవడంతో మరింత ఆందోళన చెందారు. ఈ విషయం పోలీసు కానిస్టేబుల్‌ దీప్తి దృష్టికి వెళ్లడంతో ఆమె ప్రత్యేక చొరవ తీసుకున్నారు.

షిరో ఫొటోతో పాటు దాని వివరాలను పలు వాట్సాప్‌ గ్రూపుల్లో షేర్‌ చేశారు. స్థానిక ప్రాంతానికే పరిమితం కాకుండా నగరంలోని వివిధ ప్రాంతాలకు సమాచారం చేరేలా విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో షిరోను గుర్తించేందుకు మరింత మందికి అవకాశం లభించింది. ఈ ప్రయత్నం చివరకు ఫలించింది. మధురానగర్‌ నుంచి తప్పిపోయిన షిరో దాదాపు 20 కిలోమీటర్ల దూరంలోని మౌలాలిలో ఉన్నట్లు గుర్తించారు. అక్కడ కుక్క ఆచూకీని నిర్ధారించుకున్న అనంతరం ఈ విషయాన్ని యజమానికి సమాచారం అందించారు. దీంతో షిరోను సురక్షితంగా యజమాని వద్దకు చేర్చారు.

చాలాకాలం తర్వాత తమ పెంపుడు కుక్కను తిరిగి చూసుకోవడంతో యజమాని ఆనందం వ్యక్తం చేశారు. షిరోను గుర్తించడంలో, తిరిగి తన వద్దకు చేర్చడంలో కీలకంగా వ్యవహరించిన కానిస్టేబుల్‌ దీప్తికి కృతజ్ఞతలు తెలిపారు.
ఓ పెంపుడు జంతువు తప్పిపోయినప్పుడు దాని యజమాని పడే ఆవేదనను అర్థం చేసుకుని.. తన వంతు ప్రయత్నంగా వాట్సాప్‌ గ్రూపుల ద్వారా సమాచారాన్ని విస్తృతంగా చేరవేసిన కానిస్టేబుల్‌ దీప్తి చొరవ ఇప్పుడు ప్రశంసలు అందుకుంటోంది. ఈ ప్రయత్నం ద్వారా షిరో సురక్షితంగా తన కుటుంబాన్ని చేరుకుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← OTT Cinema : ఓటీటీలోకి వచ్చేస్తున్న నయనతార లేటేస్ట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే..రిమ్స్‌లో మృత్యుఘోష.. హైదరాబాద్‌కు ఏడుగురు చిన్నారులు.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com