☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

హైదరాబాద్ సిటీలో మళ్ళీ డబుల్ డెకర్ బస్సులు... అప్పర్ డెక్ ఓపెన్, లోయర్ డెక్ ఏసీ..

హైదరాబాద్ సిటీలో మళ్ళీ డబుల్ డెకర్ బస్సులు... అప్పర్ డెక్ ఓపెన్, లోయర్ డెక్ ఏసీ..
హైదరాబాద్ సిటీలో మళ్ళీ డబుల్ డెకర్ బస్సులు... అప్పర్ డెక్ ఓపెన్, లోయర్ డెక్ ఏసీ..
హైదరాబాద్ సిటీలో మళ్ళీ డబుల్ డెకర్ బస్సులు... అప్పర్ డెక్ ఓపెన్, లోయర్ డెక్ ఏసీ..

నగరవాసులతోపాటు హైదరాబాద్‌‌కు వచ్చే పర్యాటకుల కోసం తెలంగాణ టూరిజం డెవలప్‌‌మెంట్‌‌ కార్పొరేషన్‌‌ రెండు ఓపెన్‌‌ టాప్‌‌ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నది. లండన్‌‌ తరహాలో టాప్‌‌ లేని డబుల్‌‌ డెక్కర్‌‌ బస్సుపై కూర్చొని నగర అందాలను వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నది. నగర వారసత్వ సంపదతోపాటు ఆధునిక కట్టడాలను చూసేలా ఓపెన్‌‌ టాప్‌‌ ఎలక్ట్రిక్‌‌ డబుల్‌‌ డెక్కర్‌‌ బస్సులను కొనుగోలు చేయనున్నది.

ఇప్పటికే బస్సులను సమకూర్చుకునేందుకు ఇటీవల అర్హులైన సంస్థల నుంచి ప్రతిపాదనలు (ఆర్‌‌ఎఫ్‌‌పీ) ఆహ్వానించింది. దరఖాస్తులు, బిడ్లు సమర్పించేందుకు బుధవారం వరకు గడువు విధించారు. ఇప్పటికే పలు సంస్థల నుంచి దరఖాస్తులు వచ్చాయని టూరిజం అధికారులు చెప్తున్నారు.

అప్పర్‌‌ డెక్‌‌ ఓపెన్‌‌.. లోయర్‌‌ డెక్‌‌ ఏసీ..

పర్యాటకులను ఆకట్టుకునేలా ఈ బస్సులను తయారు చేస్తున్నారు. బస్సు అప్పర్‌‌ డెక్‌‌కు ఎలాంటి రూఫ్‌‌ ఉండదు. దీంతో ప్రయాణికులు ప్రకృతిని ఆస్వాదిస్తూ నగర అందాలను వీక్షించే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఎండ, వర్షం వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని లోయర్‌‌ డెక్‌‌ను ఏసీ క్యాబిన్‌‌గా తీర్చిదిద్దుతున్నారు. నగర చరిత్ర, చారిత్రక ప్రాధాన్యతను పర్యాటకులకు వివరించేందుకు మైక్రోఫోన్‌‌తో కూడిన ఆధునిక గైడ్‌‌ వ్యవస్థతోపాటు పబ్లిక్‌‌ అడ్రస్‌‌ సిస్టమ్‌‌ను అనుసంధానిస్తున్నారు.

ప్రయాణికుల మొబైల్‌‌ ఛార్జింగ్‌‌ అవసరాల కోసం ప్రతి సీటు వద్ద యూఎస్‌‌బీ పోర్టులు ఏర్పాటు చేయనున్నారు. రాత్రివేళల్లో ఆకట్టుకునేలా బస్సులకు ఎల్‌‌ఈడీ లైట్లు అమర్చనున్నారు. ప్రయాణికుల భద్రత, సౌకర్యం కోసం బస్సుల్లో జీపీఎస్‌‌, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు.


⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← మరికొన్ని గంటల్లో ఖైరతాబాద్ బడా గణేశ్ శోభా యాత్ర.. మధ్యాహ్నం 12 లోపే నిమజ్జనం.. రూట్ మ్యాప్ ఇదే..మరో ఏడాది వరకు ఎల్ నినో ముప్పు తప్పదా...భారత్ లో 16వేల మరణాలు తప్పవా..? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com