Dasara Effect : తెలుగువారి పెద్ద పండుగైన దసరా పండుగను పురస్కరించుకుని రాజధాని హైదరాబాద్ నగరం ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు తరలివెళ్లే ప్రయాణికులతో జాతీయ రహదారులు కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ – విజయవాడ (NH-65) జాతీయ రహదారిపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. ప్రయాణికుల రాకపోకలు ఒక్కసారిగా తీవ్రతరం కావడంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం నుంచి చౌటుప్పల్ టౌన్ వరకు దాదాపు 4 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పండుగ పూట గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవాలనుకున్న ప్రయాణికులకు ఈ ట్రాఫిక్ కష్టాలు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయి.
Read Also : సీఎం రేవంత్ తో మంత్రి తుమ్మల కీలక భేటీ

పంతంగి టోల్‌ప్లాజా వద్ద నత్తనడకన వాహనాలు.. బ్లాక్‌స్పాట్ పనులతో మరిన్ని తిప్పలు!
ట్రాఫిక్ జామ్‌కు ప్రధాన కారణాల్లో పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు అత్యంత నెమ్మదిగా కదలడం ఒకటిగా మారింది. పండుగ రద్దీకి తగ్గట్లుగా వాహనాల వేగాన్ని పెంచలేకపోవడంతో పంతంగి వద్ద కిలోమీటర్ల మేర లైన్లు కట్టాయి. దీనికి తోడు జాతీయ రహదారిపై అధికారులు గుర్తించిన 17 ప్రమాదకర ‘బ్లాక్స్పాట్ల’ వద్ద ప్రస్తుతం అభివృద్ధి, మరమ్మతు పనులు కొనసాగుతుండటం కూడా ట్రాఫిక్ జామ్‌ను మరింత తీవ్రతరం చేసింది. రోడ్డు విస్తరణ, రిపేరు పనుల వల్ల రహదారి ఇరుకుగా మారి వాహనాలు నెమ్మదిగా కదులుతుండటంతో వాహనదారులు, ప్రయాణికులు గంటల తరబడి నరకయాతన అనుభవిస్తున్నారు. పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే చర్యలు చేపట్టారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :






