☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
రోజుకో చిలగడదుంప తినండి - బీపీ, షుగర్ కంట్రోల్.. గుండె సేఫ్..!! • మీ బ్లడ్ గ్రూప్ ఏంటి? ఏ బ్లడ్ గ్రూప్ వాళ్లకి లివర్ ప్రాబ్లమ్ ముప్పు ఎక్కువో తెలుసా? • ఒమేగా 3 పుష్కలంగా ఉండే అవిసె గింజల లడ్డూ.. చలికాలంలో రోజుకొకటి తింటే ఆశ్చర్యపరిచే ఆరోగ్య ప్రయోజనాలు • ఓడియమ్మ: బాత్రూమ్‌ లో భారీ కొండచిలువ ఫొటో.. నిజమని నమ్మి 48 గంటలు గాలించారు, చివరికి చూస్తే.. • Moral stories: విడిపోతామన్న కుమారులు.. తండ్రి పెట్టిన పరీక్ష ఇదే.. 'పగిలిన పళ్లెం' కథ తెలుసా..? • చిటికెలో నోరూరించే ఉల్లిపాయ కుర్మా.. ఈ రుచికి ఇంట్లో వాళ్ళు రెండు ఇడ్లీలు ఎక్కువే తింటారు! • ఈ నెలాఖరుకు గజకేసరి రాజయోగం.. వీరి పంట పండినట్టే! • కార్తీక పౌర్ణమి శివయోగంతో ఈ రాశులవారి జీవితంలో నేడు మహాద్భుతం! •

Green Tankers: హైదరాబాద్ ప్రజలకు సూపర్ గుడ్ న్యూస్.. కేవలం రూ.400 ట్యాంకర్.. ఈ నంబర్ కి డయల్ చేయండి!

హైదరాబాద్‌లో నీటి కొరతను అధిగమించేందుకు జలమండలి ప్రత్యేక ‘గ్రీన్ ట్యాంకర్లను(Green Tankers)’ అందుబాటులోకి తెచ్చింది.
Green Tankers: హైదరాబాద్ ప్రజలకు సూపర్ గుడ్ న్యూస్.. కేవలం రూ.400 ట్యాంకర్.. ఈ నంబర్ కి డయల్ చేయండి!

Green Tankers: ఎల్‌నివో ప్రభావంతో వర్షపాతం తగ్గడంతో భాగ్యనగరంలో తాగునీటి కష్టాలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. రాబోయే రోజుల్లో సూపర్ ఎల్‌నివో పరిస్థితుల వల్ల నీటి ఎద్దడి మరింత తీవ్రమయ్యే ప్రమాదముందని హెచ్చరించిన జీహెచ్‌ఎంసీ, నీటిని వృథా చేసేవారిపై భారీ జరిమానాతో పాటు కనెక్షన్ రద్దు వంటి కఠిన చర్యలకు సిద్ధమైంది. ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రత్యామ్నాయంగా ఆధునిక సాంకేతికతతో శుద్ధి చేసిన మురుగునీటిని నిత్యావసరాలు మినహా ఇతర పనులకు సరఫరా చేసేందుకు జలమండలి నిర్ణయించింది. ఇందులో భాగంగా నవంబర్ 1 నుంచి ప్రత్యేక గ్రీన్ ట్యాంకర్ల ద్వారా పంపిణీకి శ్రీకారం చుట్టారు.

Cm Revanth Reddy: ఓట్ చోరీతోనే అధికారంలోకి బీజేపీ.. మోదీని గద్దె దించేందుకే ఈ పోరాటం.. ఢిల్లీలో సీఎం రేవంత్ సంచలన కామెంట్స్

గ్రీన్ ట్యాంకర్ల సరఫరా విధానం.. ఏయే అవసరాలకు వాడుకోవచ్చంటే?

తొలి విడతగా 21 గ్రీన్ ట్యాంకర్లను(Green Tankers) అందుబాటులోకి తీసుకురాగా, కేవలం డెలివరీ ఛార్జీల ఆధారంగా ఈ నీటిని సరఫరా చేయనున్నారు. భవనాల క్యూరింగ్, తోటపని, స్విమ్మింగ్ పూల్స్, నిర్మాణ రంగానికి సంబంధించి రోజువారీ అవసరాలకు ఈ శుద్ధి చేసిన నీటిని వినియోగించుకోవచ్చు. నగరంలోని 45 ప్రాంతాల్లో ఉన్న ఎస్టీపీ (STP) కేంద్రాల ద్వారా రోజూ 1,500 మిలియన్ గ్యాలన్ల మురుగునీటిని శుద్ధి చేస్తుండగా, 27 ఫిల్లింగ్ పాయింట్ల ద్వారా 646 ఎంఎల్‌డీ నీటిని అందుబాటులోకి ఉంచుతున్నారు.

బుకింగ్ ప్రక్రియ & ధరల వివరాలు.. 155313 నంబర్‌కు కాల్ చేసి బుక్ చేసుకోండి:

వాటర్ ట్యాంకర్ కావాలనుకునే వినియోగదారులు 155313 నంబర్‌కు కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు. ధరల విషయానికొస్తే, 5 వేల లీటర్లకు తొలి 4 కిమీలకు రూ.400 (తర్వాత కిలోమీటర్‌కు రూ.55), 10 వేల లీటర్లకు రూ.800 (తర్వాత కిలోమీటర్‌కు రూ.65), అలాగే 20 వేల లీటర్లకు రూ.1600 (తర్వాత కిలోమీటర్‌కు రూ.80) గా ఛార్జీలను నిర్ణయించారు. తాగునీటిపై ఒత్తిడి తగ్గించేందుకు పౌరులంతా ఈ ప్రత్యామ్నాయ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG
← Software employee | భారీ సిమెంట్ పైపులను ఢీ కొట్టిన కారు.. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని దుర్మరణంIshan Kishan : టీ20 క్రికెట్‌లో ఇషాన్ కిష‌న్ మ‌రో మైలురాయి.. హార్దిక్ పాండ్యా రికార్డు బ్రేక్.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com