☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
రోజుకో చిలగడదుంప తినండి - బీపీ, షుగర్ కంట్రోల్.. గుండె సేఫ్..!! • మీ బ్లడ్ గ్రూప్ ఏంటి? ఏ బ్లడ్ గ్రూప్ వాళ్లకి లివర్ ప్రాబ్లమ్ ముప్పు ఎక్కువో తెలుసా? • ఒమేగా 3 పుష్కలంగా ఉండే అవిసె గింజల లడ్డూ.. చలికాలంలో రోజుకొకటి తింటే ఆశ్చర్యపరిచే ఆరోగ్య ప్రయోజనాలు • ఓడియమ్మ: బాత్రూమ్‌ లో భారీ కొండచిలువ ఫొటో.. నిజమని నమ్మి 48 గంటలు గాలించారు, చివరికి చూస్తే.. • Moral stories: విడిపోతామన్న కుమారులు.. తండ్రి పెట్టిన పరీక్ష ఇదే.. 'పగిలిన పళ్లెం' కథ తెలుసా..? • చిటికెలో నోరూరించే ఉల్లిపాయ కుర్మా.. ఈ రుచికి ఇంట్లో వాళ్ళు రెండు ఇడ్లీలు ఎక్కువే తింటారు! • ఈ నెలాఖరుకు గజకేసరి రాజయోగం.. వీరి పంట పండినట్టే! • కార్తీక పౌర్ణమి శివయోగంతో ఈ రాశులవారి జీవితంలో నేడు మహాద్భుతం! •

ఇండియా కూటమి మెగా ర్యాలీ.. ఓపెన్ టాప్ జీపులో సోనియా, రాహుల్, రేవంత్ రెడ్డి

ఇండియా కూటమి మెగా ర్యాలీ.. ఓపెన్ టాప్ జీపులో సోనియా, రాహుల్, రేవంత్ రెడ్డి
ఇండియా కూటమి మెగా ర్యాలీ.. ఓపెన్ టాప్ జీపులో సోనియా, రాహుల్, రేవంత్ రెడ్డి
ఇండియా కూటమి మెగా ర్యాలీ.. ఓపెన్ టాప్ జీపులో సోనియా, రాహుల్, రేవంత్ రెడ్డి

ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఇండియా కూటమి నిర్వహిస్తున్న ఓట్ బచావో – దేశ్ బచావో మహా ర్యాలీకి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ నేతలు,కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. తెలంగాణ భవన్ నుంచి పలువురు నేతలు, కార్యకర్తలు రామ్‌లీలా మైదానానికి ర్యాలీగా వెళ్లారు.

మరోవైపు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసం నుంచి ఇండియా కూటమి అగ్రనేతలు రామ్‌లీలా మైదానానికి బయలుదేరారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లు ఓపెన్ టాప్ జీపుల్లో ర్యాలీగా వెళ్లారు.

ఓటర్ల జాబితాలో అవకతవకలు, ఓట్ల తొలగింపు ఆరోపణలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ఈ సభలో ఇండియా కూటమి నేతలు పాల్గొని తమ నిరసనను తెలియజేయనున్నారు. రామ్‌లీలా మైదానంలో జరుగుతున్న ఈ మహా ర్యాలీతో ఢిల్లీలో రాజకీయ సందడి నెలకొంది.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← ధంతేరస్, దీపావళికి కొత్త కారు కొంటున్నారా ?.. తక్కువ వడ్డీకే లోన్ ఇస్తున్న బ్యాంకులు ఇవే!ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు.. సిద్దిపేటలో కొత్త ఎఫ్‌ఐఆర్.. ఏ1గా హరీశ్ రావు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com