☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

India Pakistan UNGA : యూఎన్‌లో పాకిస్థాన్ దుమ్ముదుళిపిన భారత్ ప్రతినిధి.. కీలు బొమ్మలు వస్తారు.. పోతుంటారు అంటూ..

India Pakistan UNGA : పాకిస్థాన్‌కు ఐరాస వేదికగా భారత్ గట్టి హెచ్చరికలు చేసింది. ఆ దేశ ఉగ్రవాద చర్యలు, మోసం అందరికీ కనిపిస్తూనే ఉన్నాయని యూఎన్‌లో భారత శాశ్వత మిషన్ ఫస్ట్ సెక్రటరీ పెటల్‌ గహ్లోత్‌ పేర్కొన్నారు.
India Pakistan UNGA : యూఎన్‌లో పాకిస్థాన్ దుమ్ముదుళిపిన భారత్ ప్రతినిధి.. కీలు బొమ్మలు వస్తారు.. పోతుంటారు అంటూ..

India Pakistan UNGA : ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ (UNGA) వేదికగా భారత్‌, పాకిస్థాన్‌ మధ్య మరోసారి మాటల యుద్ధం కొనసాగింది. పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ కశ్మీర్‌ అంశాన్ని ప్రస్తావించిన నేపథ్యంలో.. భారత్‌ రైట్‌ ఆఫ్‌ రిప్లై ద్వారా ఘాటుగా స్పందించింది. పాకిస్థాన్‌లో అసలు అధికారాన్ని ఎవరు చెలాయిస్తున్నారనే విషయాన్ని ప్రపంచం గుర్తించాలని యూఎన్‌లో భారత శాశ్వత మిషన్ ఫస్ట్ సెక్రటరీ పెటల్‌ గహ్లోత్ అన్నారు.

Also Read : Netanyahu Pagers : చేతిలో ‘పేజర్’.. మెసేజ్ క్లియర్.. నెతన్యాహు అసలు స్ట్రాటజీ ఏంటి ? ఆ పేరు వింటే వణుకెందుకు..

ప్రజాస్వామ్య హక్కులు, మానవ విలువల గురించి పాకిస్థాన్‌ నుంచి ఉపదేశాలు వినడం విడ్డూరంగా ఉదంటూ భారత ప్రతినిధి ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. దేశంలో అధికార వ్యవస్థపై సైన్యం ప్రభావం కొనసాగుతోందని.. పాకిస్థాన్‌ను “ఆర్మీ పాలన.. ఆర్మీ చేత, ఆర్మీ కోసం నడిచే వ్యవస్థ”గా అభివర్ణించారు. అక్కడ సైన్యానిదే సర్వాధికారం. కీలు బొమ్మలు వస్తారు.. పోతుంటారు.. కానీ పెత్తనం ఎవరిదనే విషయంలో ఎలాంటి భ్రమలు అవసరం లేదు ని గహ్లోత్ దుయ్యబట్టారు.

పాకిస్థాన్‌ సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతు ఇస్తోందని, ఉగ్రవాదాన్ని ఉపయోగించుకోవడం ద్వారా తమ ప్రయోజనాలను సాధించేందుకు ఆ దేశం ప్రయత్నిస్తోందని పెటల్ గెహ్లోత్ విమర్శించారు. ఈ సందర్భంగా అల్‌ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్‌ లాడెన్‌ పాకిస్థాన్‌లోని అబ్బొటాబాద్‌లో, ఆ దేశ సైనిక అకాడమీకి సమీపంలో నివసించిన విషయాన్ని కూడా భారత్‌ ప్రతినిధి ప్రస్తావించారు. 9/11 దాడుల 25వ వార్షికోత్సవం సందర్భంగా ఈ అంశం మరింత ప్రాధాన్యం సంతరించుకుందని అన్నారు. ఉగ్రవాదంపై భారత్‌ తనను తాను రక్షించుకునే హక్కును కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

పాకిస్థాన్‌లో మతపరమైన మైనారిటీల పరిస్థితిని ప్రస్తావిస్తూ.. మత అసహనం, మానవ హక్కుల విషయంలో పాకిస్థాన్‌ తనపై తాను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని భారత ప్రతినిధి పేటల్‌ గహ్లోత్ వ్యాఖ్యానించారు. మైనారిటీల పరిస్థితిపై అంతర్జాతీయ సమాజానికి ఇప్పటికే అవగాహన ఉందని, పాకిస్థాన్ లో మైనార్టీలను ఎలా చూస్తారో యావత్ ప్రపంచానికి తెలుసు అంటూ పేర్కొన్నారు.

పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ తన ప్రసంగంలో జమ్మూ కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తడంతో భారత్‌ తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమని భారత ప్రతినిధి పునరుద్ఘాటించారు. అదే సమయంలో పాకిస్థాన్‌ ఆక్రమిత జమ్మూ కశ్మీర్‌ (PoJK)లో పరిస్థితులను కూడా అంతర్జాతీయ సమాజం పరిశీలించాలని ఆమె సూచించారు. అక్కడ హింస, ప్రాణనష్టం, ప్రాథమిక హక్కులపై ఆంక్షలు ఉన్నాయని ఆరోపించారు.

భారత్‌ స్పందనకు ముందు పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ UNGAలో కశ్మీర్‌ సమస్యను ప్రస్తావించారు. 2025లో భారత్‌-పాకిస్థాన్‌ మధ్య జరిగిన ఘర్షణ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జోక్యం చేసుకున్నారని, అది దక్షిణాసియాలో మరింత ప్రాణనష్టాన్ని నివారించిందని ఆయన పేర్కొన్నారు. అయితే మూడో పక్షం జోక్యంపై పాకిస్థాన్‌ చేసిన వాదనలను భారత్‌ గతంలో తిరస్కరించింది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Doctor Babu : మంచు కొండ‌ల్లో డాక్ట‌ర్ బాబు, మంజుల ప్రేమ గీతం.. ఫోటోలు వైర‌ల్..Asian Games : భార‌త్ ఖాతాలో మ‌రో స్వ‌ర్ణం.. ఇరాన్‌ను ఓడించి గోల్డ్ గెలుచుకున్న మ‌హిళ‌ల క‌బ‌డ్డీ జ‌ట్టు.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com