☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Asian Games: ఆర్చ‌రీ మిక్స్‌డ్ కాంపౌండ్‌ ఈవెంట్‌లో భార‌త్‌కు స్వ‌ర్ణం

Asian Games: ఏషియ‌న్ గేమ్స్‌లో 11వ రోజు భార‌త్‌కు ఆర్చ‌రీలో రెండో స్వ‌ర్ణ ప‌త‌కం ల‌భించింది. మిక్స్‌డ్ టీమ్ కాంపౌండ్ ఫైన‌ల్ ఈవెంట్‌లో భారత‌ బృందం గోల్డ్ మెడ‌ల్ గెలుచుకున్న‌ది. భార‌త మిక్స్‌డ్ జ‌ట్టులో చికితా, సాహిల్ ఉన్నారు. దీనికి ముందు మ‌హిళ‌ల కాంపౌండ్ ఈవెంట్‌లోనూ గోల్డ్ వ‌చ్చింది.
Asian Games: ఆర్చ‌రీ మిక్స్‌డ్ కాంపౌండ్‌ ఈవెంట్‌లో భార‌త్‌కు స్వ‌ర్ణం

న‌గోయా: ఏషియ‌న్ గేమ్స్‌(Asian Games)లో 11వ రోజు భార‌త్‌కు ఆర్చ‌రీలో రెండో స్వ‌ర్ణ ప‌త‌కం ల‌భించింది. మిక్స్‌డ్ టీమ్ కాంపౌండ్ ఫైన‌ల్ ఈవెంట్‌లో భారత‌ బృందం గోల్డ్ మెడ‌ల్ గెలుచుకున్న‌ది. భార‌త మిక్స్‌డ్ జ‌ట్టులో చికితా తానిప‌ర్తి, సాహిల్ జాద‌వ్‌ ఉన్నారు. ఫైన‌ల్ గేమ్‌లో కొరియ‌న్ జంటపై స్వ‌ల్ప ఆధిక్యంలో భార‌త్ కొన‌సాగింది. తొలుత కొరియ‌న్ జంట ప‌ది పాయింట్లు సాధించి భార‌త్‌పై వ‌త్తిడి పెంచింది. అయితే చికితా, సాహిల్ 10 పాయింట్స్ కొట్టి.. ఒక్క పాయింట్ లీడ్‌లో కొన‌సాగారు. దీంతో మరోసారి కొరియ‌న్ల‌పై వ‌త్తిడి పెరిగింది. ఆ త‌ర్వాత కొరియా క్రీడాకారిణి పార్క్ 10, చోయి 10 పాయింట్లు సాధించారు. దీంతో గోల్డ్ మెడ‌ల్‌ను డిఫెండ్ చేసుకునేందుకు ఇండియా ప‌ర్ఫెక్ట్ 10 కొట్టాల్సి ఉంది.

ఆ ద‌శ‌లో చికితా 9, సాహిల్ 10 పాయింట్లు చేశారు. దీంతో స్కోర్లు స‌మం అయ్యాయి. ఆ ద‌శ‌లో షూట్ ఆఫ్ నిర్వ‌హించారు. షూట్ ఆఫ్‌లో తొలుత చికితా 10 పాయింట్లు, ఆ త‌ర్వాత సాహిల్ 10 పాయింట్లు కొట్టి ప్ర‌త్య‌ర్థిపై వ‌త్తిడి పెంచారు. కొరియా ప్లేయ‌ర్ చోయి వ‌త్తిడిలో 9 పాయింట్స్ కొట్టాడు. దీంతో భార‌త మిక్స్‌డ్ బృందానికి స్వ‌ర్ణ ప‌త‌కం క‌న్ఫ‌ర్మ్ అయ్యింది. గోల్డ్ మెడ‌ల్ సాధించిన భార‌త మిక్స్‌డ్ బృందం .. లాస్ ఏంజిల్స్‌లో జ‌రిగే 2028 ఒలింపిక్స్‌కు అర్హ‌త సాధించారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Epic | థియేటర్లలో నిరాశ.. ఓటీటీలో ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’కు మరో ఛాన్స్, స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?NTR | బాలయ్య డైలాగ్‌ను తారక్ పలికితే.. ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ఈవెంట్‌లో దద్దరిల్లిన వేదిక! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com