☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

ఆసియా గేమ్స్‌లో భారత్‌కు పతకాల పంట.. షూటింగ్‌లో రజతం, మారథాన్‌లో సావన్ రికార్డ్!

ఆసియా గేమ్స్‌లో భారత్‌కు పతకాల పంట.. షూటింగ్‌లో రజతం, మారథాన్‌లో సావన్ రికార్డ్!
ఆసియా గేమ్స్‌లో భారత్‌కు పతకాల పంట.. షూటింగ్‌లో రజతం, మారథాన్‌లో సావన్ రికార్డ్!
ఆసియా గేమ్స్‌లో భారత్‌కు పతకాల పంట.. షూటింగ్‌లో రజతం, మారథాన్‌లో సావన్ రికార్డ్!

2026 ఆసియా క్రీడలలో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శనలతో అదరగొడుతున్నారు. ఆయా విభాగాల్లో ఇండియన్ టీమ్ పతకాల జోరు కొనసాగుతుండగా, షూటింగ్, మారథాన్‌లలో టీమిండియా క్రీడాకారులు సంచలన విజయాలు నమోదు చేశారు.

షూటింగ్‌లో ఇండియన్ ఉమెన్స్ రజతం:

* మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ టీమ్ ఈవెంట్‌లో తిలోత్తమ సేన్, విదర్శ కే వినోద్, ఆషి చౌక్సేలతో కూడిన భారత వనితల జట్టు అద్భుత ప్రతిభ కనబరిచింది.

* హోరాహోరీగా కొనసాగిన ఈ పోటీలో భారత త్రయం మొత్తం 1763– 90x పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకం కైవసం చేసుకుంది. ఈ విభాగంలో చైనా బంగారు పతకాన్ని అందుకుంది.

* వ్యక్తిగత అర్హత పోటీల్లో తిలోత్తమ సేన్ 590 పాయింట్లతో, విదర్శ 588 పాయింట్లతో అదరగొట్టి ఫైనల్స్‌కు అర్హత సాధించారు.

మారథాన్‌లో సావన్ బర్వాల్ రికార్డ్:

* పురుషుల మారథాన్‌లో భారత లాంగ్ డిస్టెన్స్ రన్నర్ సావన్ బర్వాల్ అసాధారణ ప్రదర్శనతో రికార్డు సృష్టించారు.

* ఈ రేసును కేవలం 2:11:37 సమయంలో పూర్తి చేసి జాతీయ రికార్డును నెలకొల్పడంతో పాటు రజత పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.

భారత క్రీడాకారుల అద్భుత ప్రదర్శన:

* డెకాథ్లాన్: డెకాథ్లాన్ 100 మీటర్ల ఈవెంట్‌లో తేజస్విన్ శంకర్ ఐదో స్థానంలో, తౌఫీక్ నౌషాద్ ఏడో స్థానంలో నిలిచారు. లాంగ్ జంప్‌లో తేజస్విన్ 7.53 మీటర్ల అత్యుత్తమ ప్రదర్శనతో అగ్రస్థానంలో నిలవగా, తౌఫీక్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

* ఫెన్సింగ్: భారత్ ఫెన్సింగ్ జట్లు అదరగొట్టాయి. మహిళల ఫోయిల్ జట్టు (ఇండోనేషియాపై 45–24తో విజయం), పురుషుల సేబ్రే జట్టు (ఫిలిప్పీన్స్‌పై 45–27తో గెలుపు) తమ రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లలో గెలిచి క్వార్టర్ ఫైనల్స్‌లోకి దూసుకెళ్లాయి.

* కెనో స్ప్రింట్: మిక్స్డ్ కయాక్ డబుల్ 500 మీటర్ల సెమీఫైనల్‌లో పార్వతి గీత, ప్రసన్న కుమార్ జోడి రెండో స్థానంలో నిలిచి ఫైనల్ Aకి అర్హత సాధించారు.

* నిరాశపరిచిన మ్యాచ్‌లు: బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో లక్ష్య సేన్ (సింగపూర్ ఆటగాడు లో కీన్ యెవ్ చేతిలో) ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించారు. అలాగే టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ రౌండ్ 3లో యశస్విని ఘోర్పడే పరాజయం చవిచూసింది.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← గురుగ్రామ్లో హిట్ అండ్ రన్ కలకలం.. స్టూడెంట్ను థార్తో ఢీ కొట్టి దాడి !టీమిండియాకు బిగ్ టెన్షన్.. సిరాజ్ బౌలింగ్‌లో గాయపడిన గిల్.. రేపు ఆడేది డౌటే? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com