☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

జ‌పాన్ పై అతి కష్టమ్మీద గెలిచిన టీమిండియా!

ఆసియా క్రీడల్లో మన ఇండియన్ మెన్స్ క్రికెట్ టీమ్ కూడా సూపర్ స్టార్‌లా అడుగుపెట్టింది. అసలు టోర్నీ మొదలవడానికి ముందే జపాన్‌తో ఒక చారిత్రక టీ20 మ్యాచ్ ఆడింది. జపాన్‌తో మన దేశానికి ఉన్న 75 ఏళ్ల స్నేహానికి గుర్తుగా ఈ మ్యాచ్ నిర్వహించారు. అయితే వర్షం అడ్డుపడటంతో ఈ మ్యాచ్‌ను కేవలం 5 ఓవర్లకు కుదించారు. ఆ చిన్న మ్యాచ్‌లో మనోళ్ళు జపాన్‌పై కేవలం 2 పరుగుల తేడాతో అతి కష్టమ్మీద గెలిచి బోణీ కొట్టారు! […] The post జ‌పాన్ పై అతి కష్టమ్మీద గెలిచిన టీమిండియా! appeared first on Adya News Telugu.
జ‌పాన్ పై అతి కష్టమ్మీద గెలిచిన టీమిండియా!

ఆసియా క్రీడల్లో మన ఇండియన్ మెన్స్ క్రికెట్ టీమ్ కూడా సూపర్ స్టార్‌లా అడుగుపెట్టింది. అసలు టోర్నీ మొదలవడానికి ముందే జపాన్‌తో ఒక చారిత్రక టీ20 మ్యాచ్ ఆడింది. జపాన్‌తో మన దేశానికి ఉన్న 75 ఏళ్ల స్నేహానికి గుర్తుగా ఈ మ్యాచ్ నిర్వహించారు. అయితే వర్షం అడ్డుపడటంతో ఈ మ్యాచ్‌ను కేవలం 5 ఓవర్లకు కుదించారు. ఆ చిన్న మ్యాచ్‌లో మనోళ్ళు జపాన్‌పై కేవలం 2 పరుగుల తేడాతో అతి కష్టమ్మీద గెలిచి బోణీ కొట్టారు!

ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా తక్కువ ఓవర్లు కావడంతో పరుగులు చేయడానికి చాలా ఇబ్బంది పడింది. నిర్ణీత 5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి కేవలం 32 పరుగులే చేయగలిగింది. ఓపెనర్ అభిషేక్ శర్మ మళ్లీ డకౌట్ అయ్యాడు. సంజూ శాంసన్ (9), ఇషాన్ కిషన్ (3) కూడా పెద్దగా ఏమీ చేయలేకపోయారు. శ్రేయస్ అయ్యర్ మాత్రం 16 పరుగులు చేసి కొంచెం పర్వాలేదనిపించాడు. జపాన్ బౌలర్లు గట్టిగా బౌలింగ్ చేసి మన బ్యాటర్లను కట్టడి చేశారు.

ఇక 33 పరుగుల చిన్న లక్ష్యంతో బరిలోకి దిగిన జపాన్ టీమ్ మనకు చెమటలు పట్టించింది. ఆఖరి దాకా పోరాడి గెలుపు కోసం చాలా ప్రయత్నించింది. కానీ మన బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి జపాన్‌ను 3 ఓవర్లలో కేవలం 30 పరుగులకే పరిమితం చేశారు. వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు తీసి మ్యాచ్‌ను కాపాడుకున్నాడు. ఈ గెలుపుతో అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తన 200వ విజయాన్ని నమోదు చేసింది.

అయితే ఈ మ్యాచ్‌లో మన ఓపెనర్ అభిషేక్ శర్మ పేరు మీద కొన్ని చెత్త రికార్డులు మూటగట్టుకున్నాడు. వచ్చిన మొదటి బంతికే గోల్డెన్ డక్‌గా ఔట్ అయి పెవిలియన్ చేరాడు. టీ20ల్లో రోహిత్ శర్మ రికార్డును బ్రేక్ చేసి, అత్యధికంగా 5 సార్లు గోల్డెన్ డక్ అయిన భారత ఓపెనర్‌గా నిలిచాడు. అంతేకాదు, ఈ ఒక్క ఏడాదిలోనే ఏకంగా 10 సార్లు డకౌట్ అయ్యి ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక డకౌట్లు అయిన చెత్త రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తానికి గెలిచినా కూడా అభిషేక్ ఫామ్ మాత్రం అభిమానులను టెన్షన్ పెడుతోంది.

The post జ‌పాన్ పై అతి కష్టమ్మీద గెలిచిన టీమిండియా! appeared first on Adya News Telugu.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← SIR ప్రక్రియతో ప్రమాదంలో 43 లక్షల ఓట్లుక్రికెట్.. ఇండియాకు ఫస్ట్ గోల్డ్ మెడల్! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com