☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

హార్మూజ్‌‌‌‌‌‌‌‌లో నౌకపై దాడి.. భారతీయ నావికుడికి ఏం జరిగిందో తెలుసా..

హార్మూజ్‌‌‌‌‌‌‌‌లో నౌకపై దాడి.. భారతీయ నావికుడికి ఏం జరిగిందో తెలుసా..
హార్మూజ్‌‌‌‌‌‌‌‌లో నౌకపై దాడి.. భారతీయ నావికుడికి ఏం జరిగిందో తెలుసా..
హార్మూజ్‌‌‌‌‌‌‌‌లో నౌకపై దాడి.. భారతీయ నావికుడికి ఏం జరిగిందో తెలుసా..
  • ఎఫ్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌యూఐ వెల్లడి

న్యూఢిల్లీ: భారత్‌‌‌‌‌‌‌‌కు వస్తున్న ఎమ్‌‌‌‌‌‌‌‌వీ కేప్ డావో నౌకపై జరిగిన టార్పిడో దాడిలో ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌కు చెందిన నావికుడు సూరజ్ యాదవ్ ప్రాణాలు కోల్పోయారు. ఫార్వర్డ్ సీమెన్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌యూఐ) ఈ విషయాన్ని వెల్లడించింది. యూపీలోని డియోరియా జిల్లాకు చెందిన సూరజ్ యాదవ్.. ఈ నౌకలో వైపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా విధులు నిర్వహిస్తున్నట్టు తెలిపింది. నౌకపై రెండు టార్పిడోలతో దాడులు జరిగినట్టు ఎఫ్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌యూఐ పేర్కొంది.

మొదటి టార్పిడో సిబ్బంది నివాస ప్రాంతాలుండే పోర్ట్ సైడ్ సీ-డెక్‌‌‌‌‌‌‌‌ను, రెండవ టార్పిడో ఇంజిన్ రూమ్ సమీపంలోని పోర్ట్ సైడ్ హల్‌‌‌‌‌‌‌‌ను బలంగా తాకినట్టు చెప్పింది. ఈ నౌకలో మొత్తం 28 మంది సిబ్బంది ఉండగా, వారిలో 20 మంది భారతీయ పౌరులే కావడం గమనార్హం. ఈ ప్రాంతంలో నావికుల భద్రతకు ఇస్తున్న హామీలన్నీ ఒట్టి మాటలేనని తేలిపోయిందని ఎఫ్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌యూఐ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.

హార్మూజ్ పరిసర ప్రాంతాల్లో అమాయక నావికులను పొట్టనబెట్టుకుంటున్నారని యూనియన్ మండిపడింది. ఈ ఘటనపై బాధ్యులు తక్షణమే వివరణ ఇవ్వాలని, ఈ ప్రాంతం గుండా వెళ్లే నావికులకు సురక్షితమైన మార్గం కల్పించాలని డిమాండ్ చేసింది. అలాగే, మృతి చెందిన సూరజ్ యాదవ్‌‌‌‌‌‌‌‌కు న్యాయం చేయడంతో పాటు, ప్రాణాపాయంలో ఉన్న ప్రతి ఒక్క భారతీయ నావికుడికి రక్షణ కల్పించాలని కోరింది.

html, body,
⬇ Full News JPG⬇ Short News JPG
← At UNGA, Zelenskyy says Russia using Indians in Ukraine warమాజీ సైనికుల భూమి వారికే ఇవ్వాలె..గవర్నర్ కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com