☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

iQOO Pad Ultra Price : భారీ బ్యాటరీతో ఐక్యూ ప్యాడ్ అల్ట్రా వచ్చేసింది.. గేమింగ్ లవర్స్ కోసం అదిరిపోయే ఫీచర్లు!

iQOO Pad Ultra Price : ఐక్యూ కొత్త ప్యాడ్ అల్ట్రా గేమింగ్ టాబ్లెట్‌ను చైనాలో లాంచ్ చేసింది. ఇందులో 8.8-అంగుళాల 2K అమోల్డ్ డిస్‌ప్లే, 165Hz రిఫ్రెష్ రేట్, 16GB ర్యామ్, 9020mAh బ్యాటరీ ఉన్నాయి.
iQOO Pad Ultra Price : భారీ బ్యాటరీతో ఐక్యూ ప్యాడ్ అల్ట్రా వచ్చేసింది.. గేమింగ్ లవర్స్ కోసం అదిరిపోయే ఫీచర్లు!
  • ఐక్యూ ప్యాడ్ అల్ట్రా 165Hz 2K అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది
  • 16GB వరకు ర్యామ్, 1TB స్టోరేజ్ ఆప్షన్ అందుబాటులో ఉంది
  • ఈ టాబ్లెట్‌లో 9020mAh బ్యాటరీ, 66W ఫాస్ట్ ఛార్జింగ్ సెటప్

iQOO Pad Ultra Price : ఐక్యూ లవర్స్ కోసం కొత్త ప్యాడ్ అల్ట్రా వచ్చేసింది. కంపెనీ ఐక్యూ 16, ఐక్యూ గేమింగ్ హెడ్‌సెట్‌తో పాటు చైనాలో లాంచ్ చేసింది. ఈ కొత్త టాబ్లెట్‌లో 8.8-అంగుళాల 2K అమోల్డ్ డిస్‌ప్లే, 165Hz రిఫ్రెష్ రేట్, 500Hz వరకు టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి.

ఈ టాబ్లెట్‌లో స్పెషల్ Q4 గేమింగ్ చిప్, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్ కూడా ఉన్నాయి. లాంగ్ గేమింగ్ సెషన్‌ల సమయంలో (iQOO Pad Ultra Price) పర్ఫార్మెన్స్ స్టేబుల్ ఉంటాయి. ఈ టాబ్లెట్ LPDDR5X RAM, యూఎఫ్ఎస్ 4.1 స్టోరేజ్ ద్వారా హీట్ తగ్గించేందుకు భారీ యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో వస్తుంది.

చైనాలో ఐక్యూ ప్యాడ్ అల్ట్రా ధర CNY 6,499 (సుమారు రూ. 92,900) నుంచి ప్రారంభమవుతుంది. ఈ ధర 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ మోడల్‌ కు వర్తిస్తుంది. 16GB+256GB మోడల్ ధర CNY 7,199 (సుమారు రూ. 1,02,900), 16GB+512GB మోడల్ ధర CNY 7,999 (సుమారు రూ. 1,14,400), 16GB+1TB వేరియంట్ ధర CNY 8,999 (సుమారు రూ. 1,28,600) ఉంటుంది. ఈ టాబ్లెట్ స్టార్ సిల్వర్, ట్వైలైట్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. చైనాలో అమ్మకాలు అక్టోబర్ 5న ప్రారంభమవుతాయి. ప్రస్తుతం ప్రీ-ఆర్డర్లు అందుబాటులో ఉన్నాయి.

ఐక్యూ ప్యాడ్ అల్ట్రాలో 165Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇచ్చే 8.8-అంగుళాల 2K అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే లోకల్ పీక్ బ్రైట్‌నెస్ 4,500 నిట్స్ వరకు ఉండగా, గేమింగ్ సమయంలో టచ్ శాంప్లింగ్ రేట్ 500Hz వరకు ఉంటుంది.

Read Also : SBI 180-Day FD : సీనియర్ సిటిజన్లకు పండగే.. ఎస్బీఐ FDపై అదిరిపోయే వడ్డీ.. 180 రోజులకు ఎంత వస్తుందో తెలుసా?

ఐక్యూ ప్యాడ్ అల్ట్రా స్పెషిఫికేషన్లు :

ఈ టాబ్లెట్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ సిరీస్ ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 16GB వరకు LPDDR5X ర్యామ్, 1TB వరకు యూఎఫ్ఎస్ 4.1 స్టోరేజ్ అందిస్తుంది. ఈ కంపెనీ క్యూ4 గేమింగ్ చిప్‌ను కూడా అందిస్తోంది. సపోర్ట్ చేసే గేమ్‌లలో ఫ్రేమ్ రేట్లు, గ్రాఫిక్స్ క్వాలిటీని కూడా అప్ గ్రేడ్ చేస్తుంది.

ఐక్యూ ప్యాడ్ అల్ట్రా అత్యంత స్పెషల్ ఫీచర్ కూడా అందిస్తోంది. ఐదు లేయర్ల కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది. భారీ యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్, డ్యూయల్ ఎయిర్ ఇన్‌టేక్, 3 ఫ్యాన్ స్పీడ్ లెవెల్స్ ఉన్నాయి. కంపెనీ ప్రకారం.. మొత్తం హీట్ చాంబర్ 23,253mm² ఉంటుంది.

ఈ టాబ్లెట్ కొన్ని గేమ్‌లలో 165fps వరకు గేమింగ్‌కు సపోర్టు ఇస్తుంది. గేమింగ్ కంట్రోలింగ్ కోసం, క్యూ-ఫ్లెక్స్ సిస్టమ్‌ అందించారు. ఇందులో 500Hz టచ్ శాంప్లింగ్, డ్యూయల్ ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటార్, 4డీ వైబ్రేషన్ ఉన్నాయి. కంపెనీ గేమింగ్ క్లాంప్, ఐక్యూ జీ1 టెలిస్కోపిక్ కంట్రోలర్ వంటి ప్రత్యేక యాక్సెసరీలను కూడా అందిస్తోంది.

ఐక్యూ ప్యాడ్ అల్ట్రా 9,020mAh బ్యాటరీతో వస్తుంది. 66W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో Wi-Fi 7, బ్లూటూత్ 5.4, USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఆడియో కోసం సూపర్ ఆడియో 8.0, 10-బ్యాండ్ ఈక్వలైజర్, స్పేషియల్ ఆడియో సపోర్ట్‌తో క్వాడ్-స్పీకర్ సెటప్ ఉంది. కెమెరా సెటప్‌లో 13MP రియర్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ టాబ్లెట్ బరువు సుమారుగా 298 గ్రాములు, మందం 5.74mm ఉంటుంది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← JioBharat 4G : జియో భారీ ఆఫర్.. రూ. 1,499 జియోభారత్ 4G ఫోన్.. జస్ట్ రూ. 299కే.. 6 నెలలు ఫ్రీ రీఛార్జ్ ఆఫర్..!SBI 180-Day FD : సీనియర్ సిటిజన్లకు పండగే.. ఎస్బీఐ FDపై అదిరిపోయే వడ్డీ.. 180 రోజులకు ఎంత వస్తుందో తెలుసా? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com