☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కరవు ప్రాంతాల్లో గ్రామీణ కూలీలకు గుడ్‌న్యూస్.. 15 రోజుల్లో జాబ్‌కార్డులు • Viral Video: పిచ్చిదానిలా మారిన భార్యను రోడ్డుపై చూసి భర్త తట్టుకోలేక.. ఎలా ఏడ్చాడో చూడండి! వీడియో వైరల్ • వాస్తు ప్రకారం.. ఇంట్లో తులసి మొక్కను ఉంచకూడని ప్రదేశాలు • నేడు స్థిరంగా బంగారం ధరలు • అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ మహిళ మృతి • Sarpanch Suicide Attempt | ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వేధింపులు.. కరీంనగర్‌ జిల్లాలో సర్పంచ్ ఆత్మహత్యాయత్నం! • OTT Cinema : థియేటర్లలో సంచలనం.. ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ హిట్.. ఓటీటీలోకి వస్తున్న రూ.140 కోట్ల సినిమా.. • Video: ఒకే ఓవర్‌లో రెండు మిస్టేక్స్.. లక్కీ ఛాన్స్ ఇస్తే ఇలా చేశావేంట్రా..! •

Chiranjeevi: వెంకటేష్ రిజెక్ట్ చేసిన కథతో మెగాస్టార్ చిరంజీవి సినిమా.. కట్ చేస్తే బాక్సాఫీస్ రికార్డులు బద్దలు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి- విక్టరీ వెంకటేష్ ల మధ్య మంచి అనుబంధం ఉంది. స్టార్ హీరోలైనా వీరు మంచి ఫ్రెండ్స్ గానే ఉంటారు. ఆ మధ్యన చిరంజీవి నటించిన మన శంకరవరప్రసాద్ గారు మూవీలో వెంకీ ఓ క్యామియో రోల్ కూడా చేశాడు.
Chiranjeevi: వెంకటేష్ రిజెక్ట్ చేసిన కథతో మెగాస్టార్ చిరంజీవి సినిమా.. కట్ చేస్తే బాక్సాఫీస్ రికార్డులు బద్దలు

సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో కోసం అనుకున్న కథ ఇంకో హీరో దగ్గరికి వెళ్లడం సర్వ సాధారణం. అలా చేతులు మారిన కొన్ని ప్రాజెక్టులు ఒక్కోసారి దారుణంగా ఫ్లాప్ అవుతాయి. మరోసారి రికార్డులు బద్దలు కొడుతాయి. టాలీవుడ్ స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి- విక్టరీ వెంకటేష్ విషయంలోనూ ఇలా ఒకసారి జరిగింది. టాలీవుడ్ లో ఈ ఇద్దరి హీరోల మధ్య మంచి అనుబంధం ఉంది. స్టార్ హీరోలు అయినప్పటికీ మంచి ఫ్రెండ్స్ గానే ఉంటారు. ఒకరి ఫ్యామిలీ ఫంక్షన్ కు మరొకరు తప్పకుండా హాజరవుతుంటారు. ఆ మధ్యన మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన మన శంకరవరప్రసాద్ గారు మూవీలో వెంకీ ఓ క్యామియో రోల్ కూడా చేశాడు. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అయితే గతంలో వెంకటేష్ రిజెక్ట్ చేసిన ఓ సినిమాతో మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టాడు. రీమేక్ సినిమానే అయినప్పటికీ చిరంజీవి యాక్టింగ్, స్క్రీన్ ప్రజెన్స్ తో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రికార్డులు బద్దలు కొట్టింది. ఇంతకీ ఆ సినిమా ఏదనుకుంటున్నారా?

బాలీవుడ్‌లో రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో సంజయ్ దత్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్.’ హ్యూమర్, సెంటిమెంట్, కామెడీ కలగలిపిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో ఇదే సినిమాను విక్టరీ వెంకేటేష్ తో తెలుగులో రీమేక్ చేద్దామనుకున్నారు. వెంకటేష్ కూడా ఈ సబ్జెక్ట్‌పై అమితాసక్తి చూపించడంతో దాదాపు ఈ ప్రాజెక్ట్ ఫిక్స్ అయినట్టేనని అందరూ అనుకున్నారు. అయితే ఉన్నట్లుండి ఈ సినిమాకు ఊహించని అడ్డంకులు వచ్చాయి. నిర్మాతలు కూడా మారిపోయారు. దీంతో హీరో కూడా మారిపోయారు. చివరకు మెగాస్టార్ చిరంజీవి దగ్గరకు ఈ సినిమా చేరింది. ఈ కథలోని హ్యూమన్ ఎమోషన్స్, మాస్ కామెడీ అంశాలు విపరీతంగా నచ్చేయడంతో చిరంజీవి కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దర్శకుడు జయంత్ సి. పరాన్జీ సారథ్యంలో చిరంజీవి ఇమేజ్, ఆయన బాడీ లాంగ్వేజ్‌కు తగినట్లుగా కథలో తగిన మార్పులు చేసి ‘శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్.’గా తెరకెక్కించారు.

2004, అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ముఖ్యంగా చిరంజీవి చేసిన కామెడీకి ఆడియెన్స్ కడుపుబ్బా నవ్వించారు. ఈ సినిమాలో శ్రీకాంత్ ఏటీఏం అనే కీలక పాత్రలో నటించాడు. సోనాలి బింద్రే హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ సీనియర్ నటుడు పరేష్ రావల్ లింగం మావయ్య పాత్రలో అదరగొట్టారు. ఇక రాక్‌స్టార్ దేవి శ్రీప్రసాద్ అందించిన పాటలు చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← హనుమాన్ చాలీసా ఎలా పుట్టింది? తులసీదాసుకు హనుమంతుడు ప్రత్యక్షమైన ఆసక్తికర కథ ఇదేHouse Construction: తక్కువ బడ్జెట్‌లో ఇల్లు కట్టుకోవడం ఎలా? దేనికి ఎంత ఖర్చు.. పూర్తి వివరాలు! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com