☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Video: వామ్మో.. మూన్‌బాల్‌‌ను వెంటాడిన బ్యాటర్.. కట్‌చేస్తే.. దిమ్మతిరిగే షాకిచ్చిన అంపైర్..!

Raf MacMillan Bizarre Moonball: ఆస్ట్రేలియా దేశవాళీ వన్‌డే కప్ టోర్నమెంట్‌లో ఒక అరుదైన, విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. బౌలర్ చేతిలో నుంచి జారి గాల్లోకి లేచిన ఒక వింత బంతి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ క్రమంలో అంపైర్ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
Video: వామ్మో.. మూన్‌బాల్‌‌ను వెంటాడిన బ్యాటర్.. కట్‌చేస్తే.. దిమ్మతిరిగే షాకిచ్చిన అంపైర్..!

Raf MacMillan Bizarre Moonball: అడిలైడ్‌లోని కారెన్ రోల్టన్ ఓవల్ వేదికగా సౌత్ ఆస్ట్రేలియా, టాస్మానియా (Tasmania) జట్ల మధ్య వన్‌డే కప్ మ్యాచ్ జరిగింది. ఈ పోరులో సౌత్ ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆసక్తికర పరిణామం ఎదురైంది. ఇన్నింగ్స్ పదిహేనవ ఓవర్లో రఫ్ మాక్‌మిలన్ (Raf MacMillan) బౌలింగ్ చేయడానికి వచ్చాడు. అప్పటికే సౌత్ ఆస్ట్రేలియా జట్టు ఓపెనర్ల జోరుతో పటిష్ట స్థితిలో ఉంది. బౌలింగ్ చేస్తున్న సమయంలో మాక్‌మిలన్ చేతి నుంచి బంతి ఒక్కసారిగా జారిపోయింది. పిచ్‌కు చాలా దూరంగా లెగ్ సైడ్ వైపు ఎత్తుగా వెళ్లిన ఆ వింత బంతిని చూసి బౌలర్ స్వయంగా వెతకాల్సి వచ్చింది.

క్రీజులో ఉన్న సౌత్ ఆస్ట్రేలియా బ్యాటర్ జేక్ వెదర్‌హాల్డ్ (Jake Weatherald) ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావించాడు. పరుగెత్తుకుంటూ వచ్చి ఆ బంతిని డీప్ మిడ్ వికెట్ అలాగే డీప్ స్క్వేర్ లెగ్ మధ్య నుంచి బౌండరీకి తరలించాడు. అయితే అంపైర్ వెంటనే దానిని నో-బాల్‌గా ప్రకటించి డెడ్ బాల్ అని తీర్పు చెప్పాడు. దీంతో ఆ బౌండరీని రద్దు చేశాడు. అనుభవజ్ఞుడైన ఆస్ట్రేలియన్ అంపైర్ గెరార్డ్ అబూద్ (Gerard Abood) నిబంధనల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నాడు. నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న మెకెంజీ హార్వి (Mackenzie Harvey) తో మాట్లాడి వివరణ ఇచ్చాడు. బంతి పిచ్ అవతలికి పడటంతో నో-బాల్ అయింది. అలాగే బ్యాటర్ కొట్టేలోపు బంతి స్థిరపడటంతో డెడ్ బాల్ కింద పరిగణించారు.

ఫ్రీ-హిట్ రూపంలో వచ్చిన అవకాశాన్ని వెదర్‌హాల్డ్ బాగా ఉపయోగించుకున్నాడు. మాక్‌మిలన్ వేసిన తర్వాతి బంతిని లాంగ్-ఆన్ పైకి భారీ సిక్స్ కొట్టి కోపం తీర్చుకున్నాడు. ఈ మ్యాచ్‌లో సౌత్ ఆస్ట్రేలియా జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ (Jake Fraser-McGurk) కేవలం 47 బంతుల్లో 98 పరుగులు సాధించి అదరగొట్టాడు. టెస్ట్ జట్టులో చోటు కోల్పోయిన వెదర్‌హాల్డ్ 92 పరుగులు బాదాడు. వికెట్ కీపర్ మాథ్యూ గిల్కేస్ (Matthew Gilkes) 97 పరుగులతో అజేయంగా నిలిచాడు. చివరకు సౌత్ ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 383 పరుగుల భారీ స్కోరు సాధించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Bigg Boss 10 Telugu: ఒక్క దెబ్బతో మారిన ఓటింగ్.. టాప్‏లోకి దూసుకొచ్చిన కంటెస్టెంట్.. ఈసారి బయటకు మరో అమ్మాయి..రాబోయే 6 నెలలు యమ డేంజర్.. సూపర్ ఎల్‌నినోతో లక్షల మంది ప్రాణాలకు ముప్పు! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com