KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అమెరికాలోని భారత రాయబార కార్యాలయం (ఎంబసీ) అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వాషింగ్టన్‌లోని ఎంబసీ కార్యాలయం ఎదుట నిల్చొని చిత్రీకరించిన ఒక వీడియో సందేశాన్ని ఆయన సోషల్ మీడియాలో విడుదల చేశారు. తన పాస్‌పోర్ట్ రెన్యూవల్ కాకుండా గత మూడు నెలలుగా అధికారులు ఉద్దేశపూర్వకంగా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. సాధారణ ప్రక్రియగా జరగాల్సిన పాస్‌పోర్ట్ పునరుద్ధరణను నిలిపివేయడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయా అనే అనుమానాలను వ్యక్తంచేస్తూ, కేంద్ర ప్రభుత్వ తీరుపై తన శైలిలో తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కారు.
Read Also : ఫ్లైదుబాయ్ విమాన ఘటన.. భారత పైలట్ సాహసానికి ఇజ్రాయెల్ ప్రధాని ప్రశంసలు

ప్రధాని మోదీ, అమిత్ షాలకు ‘స్వీట్ వార్నింగ్’
ఈ వీడియో వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌లను ఉద్దేశించి కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “నా పాస్‌పోర్ట్ రెన్యూవల్ చేయవద్దని మీరేమైనా స్వయంగా ఆదేశాలు ఇచ్చారా? లేదా విదేశాంగ మంత్రి జైశంకర్ చెప్పారా? నేను భారత్‌కు వస్తే ఎక్కడ మీ రాజకీయాలకు ఇబ్బంది ఎదురవుతుందోనని భయపడుతున్నారా?” అంటూ ప్రశ్నించారు. “నేను నోరు విప్పితే అనవసరమైన చిక్కులు, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది” అంటూ కేంద్ర పెద్దలకు ‘స్వీట్ వార్నింగ్’ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తీవ్ర వైరల్‌గా మారడమే కాకుండా, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :






