KTR : తెలంగాణ బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆస్తుల వ్యవహారంపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్తుల విషయంలో కేటీఆర్ మాట్లాడే మాటలు వింటే అబద్ధం కూడా సిగ్గుతో తలవంచుకుంటుందని రేవంత్ తీవ్ర స్థాయిలో ఎద్దేవా చేశారు. సిరిసిల్ల వేదికగా జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన సీఎం, బీఆర్ఎస్ పాలనలో విచ్చలవిడిగా సంపాదించిన ఆస్తులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. “హైదరాబాద్‌లో ఫామ్‌హౌస్‌లు సరిపోక ఐటీ కారిడార్ అయిన హైటెక్ సిటీ పక్కనే ఫైవ్ స్టార్ హోటళ్లు, రూ. వేల కోట్ల విలువైన ప్రాపర్టీలు కేటీఆర్ దక్కించుకున్నారని, ఇన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో ప్రజలకు సమాధానం చెప్పాలి” అని రేవంత్ రెడ్డి నిలదీశారు.
Read Also : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో DRI ఆపరేషన్.. భారీగా కొకైన్ స్వాధీనం

‘దుబాయ్ పాస్‌పోర్ట్ బ్రోకర్ కొడుకు’: అసెంబ్లీలో ఎందుకు చెప్పలేదంటే..
ఆస్తుల వివరాలను అసెంబ్లీ వేదికగా ఎందుకు బయటపెట్టలేదనే ప్రశ్నకు సీఎం రేవంత్ సమాధానమిస్తూ, దీని వెనుక ఇంకా ‘పార్ట్-2’ విచారణ మిగిలే ఉందన్నారు. “ఒకనాటి దుబాయ్ పాస్‌పోర్ట్ బ్రోకర్ కొడుకు ఇన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులను ఎలా సంపాదించాడో ప్రజలు గమనించాలని” వ్యాఖ్యానించారు. త్వరలోనే కేటీఆర్ ఆస్తుల చిట్టా మొత్తాన్ని ఆధారాలతో సహా బయటపెట్టి, ప్రజా క్షేత్రంలో నిలబెడతామని రేవంత్ హెచ్చరించారు. సిరిసిల్లా గడ్డపై నుంచే బీఆర్ఎస్ నాయకుల అక్రమ సంపాదనను ఎండగడతామని, ప్రజలకు వాస్తవాలను తెలియజేస్తామని సీఎం స్పష్టం చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :






