Raghunandan Rao: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సిరిసిల్లపై రాజకీయంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడకుండా, నిజంగా దమ్ముంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను అరెస్ట్ చేసి చూపించాలని సీఎంకు సవాల్ విసిరారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గాన్ని సమానంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉంటుందని, కానీ కేవలం తన సొంత నియోజకవర్గంపైనే ప్రత్యేక దృష్టి పెడుతూ కొడంగల్ సీఎంలా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.

గవర్నర్‌ను కలిసిన ఎంపీ రఘునందన్ రావు
బుధవారం హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాను ఎంపీ రఘునందన్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయ పరిణామాలు మరియు అభివృద్ధి అంశాలపై చర్చించినట్లు తెలిపారు. ప్రభుత్వ తీరుపై ప్రజల్లో వ్యతిరేకత వస్తోందని, నియోజకవర్గాల అభివృద్ధిలో తీవ్ర అసమానతలు కనిపిస్తున్నాయని ఆయన ఆరోపించారు.
Read also: Telangana Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం
Raghunandan Rao: ఈ నెల 4న తూప్రాన్‌లో అమూల్ చిల్లింగ్ సెంటర్‌కు అమిత్ షా శంకుస్థాపన
ఈ సమావేశంలోనే రాష్ట్రానికి సంబంధించిన మరో కీలక విషయాన్ని రఘునందన్ రావు వెల్లడించారు. మెదక్ జిల్లా, తూప్రాన్ మండలం బ్రాహ్మణపల్లిలో ఈ నెల 4వ తేదీన ప్రతిష్టాత్మకమైన అమూల్ చిల్లింగ్ సెంటర్‌ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నట్లు ఎంపీ స్పష్టం చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:






