☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Kalyani Priyadarshan | ముంబైకి మకాం మార్చిన కల్యాణి ప్రియదర్శన్‌

దక్షిణాదిలో ప్రతిభావంతురాలైన నాయికగా గుర్తింపును సంపాదించుకుంది కల్యాణి ప్రియదర్శన్‌. ముఖ్యంగా గత ఏడాది విడుదలైన ‘లోక ఛాప్టర్‌-1’ చిత్రం ఆమె కెరీర్‌ను మలుపుతిప్పింది. ఈ నేపథ్యంలో ఆమె ‘ప్రళయ్‌' సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నది. రణ్‌వీర్‌సింగ్‌ కథానాయకుడిగా జై మెహతా దర్శకత్వంలో జాంబీ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది.
Kalyani Priyadarshan | ముంబైకి మకాం మార్చిన కల్యాణి ప్రియదర్శన్‌

దక్షిణాదిలో ప్రతిభావంతురాలైన నాయికగా గుర్తింపును సంపాదించుకుంది కల్యాణి ప్రియదర్శన్‌. ముఖ్యంగా గత ఏడాది విడుదలైన ‘లోక ఛాప్టర్‌-1’ చిత్రం ఆమె కెరీర్‌ను మలుపుతిప్పింది. ఈ నేపథ్యంలో ఆమె ‘ప్రళయ్‌’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నది. రణ్‌వీర్‌సింగ్‌ కథానాయకుడిగా జై మెహతా దర్శకత్వంలో జాంబీ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. బాలీవుడ్‌లో అరంగేట్రం చేస్తూనే రణ్‌వీర్‌సింగ్‌ సరసన నటించే లక్కీఛాన్స్‌ను దక్కించుకోవడంతో ఈ సొగసరి ఆనందానికి అవధులులేకుండా పోయాయి.

ఈ నేపథ్యంలో ఈ సినిమా కోసం ఆమె లుక్‌, ఫిట్‌నెస్‌, యాక్షన్‌ స్కిల్స్‌పై ప్రత్యేకంగా దృష్టిపెడుతున్నది. అందులో భాగంగా ముంబయికి మకాం మార్చి సినిమా పూర్తయ్యే వరకు అక్కడే ఉండాలని నిర్ణయించుకుందట. ముఖ్యంగా యాక్షన్‌ ఘట్టాల కోసం గత మూడు నెలలుగా స్పెషల్‌ ట్రెయినింగ్‌ తీసుకుంటున్నదట. రణ్‌వీర్‌సింగ్‌తో కలిసి వర్క్‌షాప్స్‌, రిహార్సల్స్‌లో పాల్గొంటూ బిజీగా గడుపుతున్నదీ భామ. ఈ సినిమా ద్వారా బాలీవుడ్‌లో బ్రేక్‌ సాధించి ఉత్తరాదిన కూడా తన ఇమేజ్‌ను పెంచుకోవాలనే లక్ష్యంతో కల్యాణి ప్రియదర్శన్‌ ఉందని చెబుతున్నారు. ‘ప్రళయ్‌’ చిత్రం అక్టోబర్‌లో సెట్స్‌మీదకు వెళ్లనుంది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Salman Khan | సల్మాన్ ఖాన్ ‘మాన్స్టర్’లో భారీ తారాగణం.. నయనతారతో తొలిసారి జోడీ, క్రేజీ పోలీస్‌గా భాయ్?Priyadarshi | కేసీఆర్‌గారి పాత్రలో జీవించావు.. నటుడు ప్రియదర్శిని అభినందించిన మాజీ మంత్రి హరీశ్‌ రావు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com