☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

ఆసియా క్రీడల్లో భారత్‎కు రెండో స్వర్ణం.. 'బంగారు' గురి పెట్టిన కమల్‌జీత్‌–సురుచి జోడీ

ఆసియా క్రీడల్లో భారత్‎కు రెండో స్వర్ణం.. 'బంగారు' గురి పెట్టిన కమల్‌జీత్‌–సురుచి జోడీ
ఆసియా క్రీడల్లో భారత్‎కు రెండో స్వర్ణం.. 'బంగారు' గురి పెట్టిన కమల్‌జీత్‌–సురుచి జోడీ
ఆసియా క్రీడల్లో భారత్‎కు రెండో స్వర్ణం.. 'బంగారు' గురి పెట్టిన కమల్‌జీత్‌–సురుచి జోడీ

టోక్యో: ఆసియా క్రీడల్లో భారత్‎కు రెండో గోల్డ్ మెడల్ లభించింది. షూటింగ్ విభాగంలో కమల్‌జీత్‌-సురుచి సింగ్ జోడీ స్వర్ణ పతకం సాధించింది. శుక్రవారం (సెప్టెంబర్ 25) జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఫైనల్‌లో 484.6 పాయింట్లతో భారత ద్వయం ప్రథమ స్థానంలో నిలిచింది. ఈవెంట్ ఆద్యంతం కమల్‌జీత్, సురుచి ఆధిక్యాన్ని కొనసాగించారు.

కొరియా గట్టి పోటీ ఇచ్చినప్పటికీ 6.6 పాయింట్ల తేడాతో పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో నిలిచి భారత జోడీ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. 478 పాయింట్లతో కొరియా రెండో స్థానంలో నిలిచింది. 415.8 పాయింట్లతో ఇరాన్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఈ విజయంతో కమల్‌జీత్‌-సురుచి సింగ్ జోడీ సరికొత్త ఏషియన్ రికార్డును క్రియేట్ చేసింది. గతంలో ఉజ్బెకిస్థాన్ జోడీ (481.3 పాయింట్లు) పేరిట ఉన్న రికార్డును వీరు బద్దలుకొట్టారు.

క్వాలిఫికేషన్ రౌండ్‌లోనూ కమల్‌జీత్-సురుచి జోడీ 587 పాయింట్లు సాధించి అగ్రస్థానంతో ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. కాగా, ఆసియా గేమ్స్ 2026లో భారతదేశానికి ఇది రెండో స్వర్ణ పతకం. భారత మహిళల క్రికెట్ జట్టు గోల్డ్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే. అద్భుతమైన ప్రదర్శనతో దేశానికి రెండో స్వర్ణ పతకం అందించిన కమల్‌జీత్-సురుచి జోడీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

షూటింగ్‎లో ఇదే తొలి మెడల్:

జపాన్ వేదికగా జరుగుతోన్న 2026 ఆసియా క్రీడల్లో షూటింగ్ విభాగంలో భారత్‎కు ఇదే తొలి మెడల్. భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఒలింపిక్ పతక విజేత మను భాకర్ కూడా మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్‌కు చేరుకున్నప్పటికీ పతకం సాధించలేకపోయారు. పురుషుల, మహిళల టీమ్ ఈవెంట్లలో కూడా భారత్ పతకాలు సాధించడంలో విఫలమైంది.

దీంతో10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్‎పైన ఇండియా ఆశలు పెట్టుకుంది. అయితే, ఈ కీలక పోరుకు ముందు నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. సురుచితో జతకట్టిన పురుష షూటర్‌ను మార్చింది. మొదట కేదార్లింగ్ బాలకృష్ణ ఉచగన్వే పేరును సురుచికి జోడీగా ప్రకటించారు.

కానీ గురువారం జరిగిన పురుషుల క్వాలిఫికేషన్‌లో కమల్‌జీత్ 580 పాయింట్లతో భారతదేశం తరపున అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. మరోవైపు, కేదార్లింగ్ కఠినమైన క్వాలిఫికేషన్ రౌండ్‌ను ఎదుర్కొని 568 పాయింట్లతో 35వ స్థానంలో నిలిచాడు. దీంతో సురుచికి జోడీగా కమల్‌జీత్‎ను మిక్స్‌డ్ టీమ్‌లోకి తీసుకోవాలని ఎన్‌ఆర్‌ఏఐ నిర్ణయించింది. ఎన్‌ఆర్‌ఏఐ చివరి నిమిషంలో తీసుకున్న ఈ నిర్ణయం ఫలించింది.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← బంగారం కొనుడు కాదు తాకట్టుపెట్టుడు పెరిగింది.. అప్పులు పుట్టకనే గోల్డ్ లోన్స్ ట్రెండ్!UPI ఫ్రీ డేస్ కౌంట్‌డౌన్ షురూ: ఛార్జీల మోతతో రూటు మార్చేస్తున్న చిన్న వ్యాపారులు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com