☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
నరసాపురం మున్సిపాలిటీపై కూటమి జెండా ఎగరేస్తాం! • Gold-Silver Prices Today : పండుగ వేళ బంగారం ధరల్లో కీలక మార్పులు.. తులం రేటు ఎంతంటే? • దసరా తర్వాతే పట్టాలెక్కే ఛాన్స్ • ఘోర ప్రమాదం: కాలువలో పడిన మినీ బస్సు.. 8 మంది మృతి • అబ్బా వీటిని అనవసరంగా లైట్‌ తీసుకున్నామే.. జుట్టురాలడానికి అసలు కారణం ఈ అలవాట్లేనా? • Vaibhav Sooryavanshi: గంభీర్ ఛాన్స్ ఎప్పుడు ఇస్తారు? వైభవ్ సూర్యవంశీ రెండు పదాలతో చెప్పిన సమాధానం ఇదే • Tesla: ఫ్లయింగ్ కారు కేవలం శాంపిల్ మాత్రమే.. మస్క్ నెక్ట్స్ ఈ మూడు ప్రాజెక్టుల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..! • ట్రంప్ కీలక నిర్ణయం.. రష్యాపై చమురు ఆంక్షల్లో మినహాయింపులు? •

విజయవాడ మేయర్ పీఠంపై కమ్మ వర్గం అసంతృప్తి..!

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే కూటమిలో సామాజిక వర్గాల వారీగా తీవ్ర అంతర్మథనం మొదలైంది. బెజవాడ మేయర్ స్థానాన్ని జనసేన పార్టీకి కేటాయించడమే కాకుండా.. అక్కడి నుండి వంగవీటి రాధాకృష్ణను కూటమి ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు స్థానిక కమ్మ సామాజిక వర్గ నేతలకు ఏమాత్రం మింగుడుపడటం లేదు. దశాబ్దాలుగా విజయవాడ రాజకీయాలను, వ్యాపార సామ్రాజ్యాన్ని శాసిస్తున్న కమ్మ వర్గానికి చెందిన ముఖ్య నేతలు ఈ నిర్ణయంపై లోలోపల రగిలిపోతున్నారు. ఒకవేళ […] The post విజయవాడ మేయర్ పీఠంపై కమ్మ వర్గం అసంతృప్తి..! appeared first on Telugu Rajyam.
విజయవాడ మేయర్ పీఠంపై కమ్మ వర్గం అసంతృప్తి..!

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే కూటమిలో సామాజిక వర్గాల వారీగా తీవ్ర అంతర్మథనం మొదలైంది. బెజవాడ మేయర్ స్థానాన్ని జనసేన పార్టీకి కేటాయించడమే కాకుండా.. అక్కడి నుండి వంగవీటి రాధాకృష్ణను కూటమి ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు స్థానిక కమ్మ సామాజిక వర్గ నేతలకు ఏమాత్రం మింగుడుపడటం లేదు. దశాబ్దాలుగా విజయవాడ రాజకీయాలను, వ్యాపార సామ్రాజ్యాన్ని శాసిస్తున్న కమ్మ వర్గానికి చెందిన ముఖ్య నేతలు ఈ నిర్ణయంపై లోలోపల రగిలిపోతున్నారు.

ఒకవేళ వంగవీటి రాధాను బరిలోకి దించాలనుకుంటే.. ఆయనను తెలుగుదేశం పార్టీలోనే ఉంచుకుని, టీడీపీ తరఫునే పోటీ చేయించవచ్చు కదా.. అసలు ఈ స్థానాన్ని జనసేన ఖాతాలోకి ఎందుకు బదిలీ చేయాల్సి వచ్చిందంటూ స్థానిక తమ్ముళ్లు అధిష్ఠానాన్ని గట్టిగా ప్రశ్నిస్తున్నారు. ఈ అసంతృప్తి వెనుక బలమైన రాజకీయ, భౌగోళిక కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. విజయవాడ నగరం మరియు దాని చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల ప్రతినిధులను గమనిస్తే..

విజయవాడ తూర్పు (గద్దె రామ్మోహన్), విజయవాడ పశ్చిమ (సుజనా చౌదరి), పెనమలూరు (బోడె ప్రసాద్), గన్నవరం (యార్లగడ్డ వెంకట్రావు) వంటి కీలక స్థానాలన్నింటిలోనూ కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతేకాకుండా విజయవాడ లోక్‌సభ ఎంపీ కేశినేని చిన్ని కూడా అదే సామాజిక వర్గానికి చెందిన నేత. ఇలా చుట్టుపక్కల అంతా తమ వర్గమే అధికారంలో ఉన్నప్పుడు, నగరానికి గుండెకాయ లాంటి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని వేరే పార్టీకి, పైగా కాపు సామాజిక వర్గానికి చెందిన వంగవీటి రాధాకు ఎలా అప్పగిస్తారంటూ సదరు నేతలు అంతర్గత సమావేశాల్లో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సీట్ల సర్దుబాటు భవిష్యత్తులో బెజవాడ రాజకీయాల్లో తమ వర్గం పట్టును బలహీనపరుస్తుందనే ముందస్తు భయం కూడా ఈ నేతల్లో వ్యక్తమవుతోంది. మేయర్ పీఠం దక్కితే నగరవ్యాప్తంగా వంగవీటి రాధా హవా పెరుగుతుందని, ఇది రాబోయే రోజుల్లో మిగిలిన నియోజకవర్గాల్లోని కమ్మ ఎమ్మెల్యేల ప్రాధాన్యతను తగ్గిస్తుందని వారు ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల క్షేత్రస్థాయిలో కమ్మ సామాజిక వర్గ ఓటర్లు, క్యాడర్ ఎంతవరకు జనసేన అభ్యర్థికి సహకరిస్తారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఈ అంతర్గత అసమ్మతిని అధిష్ఠానం సకాలంలో సర్దుబాటు చేయకపోతే, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయవకాశాలపై ఇది తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని పొలిటికల్ వర్గాలు భావిస్తున్నాయి.

The post విజయవాడ మేయర్ పీఠంపై కమ్మ వర్గం అసంతృప్తి..! appeared first on Telugu Rajyam.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← ఏపీ స్థానిక పోరులో కేంద్ర బలగాలు ఉండాల్సిందేనా..?టీమ్‌ఇండియాలోకి భువీ రీఎంట్రీ.. ఎప్పుడంటే? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com