☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
చుక్క నూనె లేకుండా నోరూరించే చిల్లీ చికెన్.. రుచిలో మాత్రం తగ్గేదేలే • కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం • ఒకనాడు ఆటో ఎక్కనివ్వలేదని.. నేడు నాలుగు ఆటోలతో ఉచిత ప్రయాణం అందిస్తున్న ట్రాన్స్‌ జెండర్ • ఒమేగా 3 పుష్కలంగా ఉండి..గుండెకు మేలు చేసే బెస్ట్ చేపలు ఇవే! • Moral Stories: వ్యాపారిని ఉరి తీయాలనుకున్న రాజు.. రాజు చావు కోరిన వ్యాపారి.. • చలికాలంలో వేడివేడిగా, రెస్టారెంట్ రుచితో 30 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే.. • 106 రోజుల పాటు కుజ సంచారం.. సింహంతో సహా ఆ 5 రాశులకు ధన, కీర్తి యోగం! • శివ యోగం ప్రభావంతో ఈ రాశులకు ఈరోజు భారీ లాభాలు! •

దానం నాగేందర్పై పోటీకి సై.. ఖైరతాబాద్ ఉప ఎన్నికల బరిలో కవిత పార్టీ

దానం నాగేందర్పై పోటీకి సై.. ఖైరతాబాద్ ఉప ఎన్నికల బరిలో కవిత పార్టీ Caption of Image. దానం నాగేందర్పై అనర్హత కారణంగా ఖాళీ అయిన ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఈ క్రమంలో.. తెలంగాణ రక్షణ సేన అధినేత కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన చేశారు. ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆమె ప్రకటించారు. వంద శాతం పోటీ చేస్తామని, అభ్యర్థి ఎవరు ఏంటనేది త్వరలో ప్రకటిస్తానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అయితదని ఆమె విమర్శించారు. ఒక పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి ఉండి.. ఇంకో పార్టీలో ఎంపీగా పోటీ చేయడం అంటే.. రాజ్యాంగ నియమాలను ప్రత్యక్షంగా ఉల్లంఘించినట్లేనని ఆమె అభిప్రాయపడ్డారు. అలాంటి పార్టీలకు ప్రజలు మద్దతు ఇచ్చారంటే.. రాజ్యాంగం అక్కర్లేదని.. రూల
దానం నాగేందర్పై పోటీకి సై.. ఖైరతాబాద్ ఉప ఎన్నికల బరిలో కవిత పార్టీ
దానం నాగేందర్పై పోటీకి సై.. ఖైరతాబాద్ ఉప ఎన్నికల బరిలో కవిత పార్టీ

దానం నాగేందర్పై అనర్హత కారణంగా ఖాళీ అయిన ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఈ క్రమంలో.. తెలంగాణ రక్షణ సేన అధినేత కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన చేశారు.

ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆమె ప్రకటించారు. వంద శాతం పోటీ చేస్తామని, అభ్యర్థి ఎవరు ఏంటనేది త్వరలో ప్రకటిస్తానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అయితదని ఆమె విమర్శించారు.

ఒక పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి ఉండి.. ఇంకో పార్టీలో ఎంపీగా పోటీ చేయడం అంటే.. రాజ్యాంగ నియమాలను ప్రత్యక్షంగా ఉల్లంఘించినట్లేనని ఆమె అభిప్రాయపడ్డారు. అలాంటి పార్టీలకు ప్రజలు మద్దతు ఇచ్చారంటే.. రాజ్యాంగం అక్కర్లేదని.. రూల్స్ అక్కర్లేదని.. ప్రజలే డైరెక్ట్గా చెప్పినట్లు అయితదని కవిత చెప్పారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నామని ప్రజలు చాటి చెప్పాలంటే ఖైరతాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ను ఓడగొట్టాల్సిందేనని ఆమె ప్రకటించారు.

ఉప ఎన్నిక అనివార్యం కావడంతో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో గెలుపు కోసం అన్ని పార్టీలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ సర్వశక్తులు కూడదీసుకునే పనిలో పడ్డాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మూడో ఉప ఎన్నిక ఇది.

సికింద్రాబాద్​ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్​ఉప ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్..​ ఖైరతాబాద్ను కూడా కైవసం చేసుకుని హ్యాట్రిక్ సాధించాలనే పట్టుదలతో ఉంది. ఇదివరకే రెండు బీఆర్ఎస్ సీట్లలో పాగా వేయగా.. ఇప్పుడు మూడో సీటును కూడా దక్కించుకుని గులాబీ శిబిరానికి సవాల్​విసరాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← ఐక్యరాజ్యసమితి వేదికగా పాక్ ప్రధాని వ్యాఖ్యలు.. నవ్వు ఆపుకోలేకపోయిన భారత దౌత్యవేత్త!నిమజ్జనం ప్రశాంతం.. ట్యాంక్బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఎత్తివేత →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com