☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

జై బోలో గణేష్ మహారాజ్‌కి.. ఖైరతాబాద్‌ మహా గణపతి వీడియో చూస్తే పూనకాలే..

హైదరాబాద్‌లో ఖైరతాబాద్‌ బడా గణేష్‌ శోభాయాత్ర వైభవంగా కొనసాగుతోంది. వేలాది మంది భక్తులు పాల్గొంటుండగా, ఎన్టీఆర్‌ మార్గ్‌ వద్ద నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు. భారీ బందోబస్తు, సీసీ కెమెరాలు, డ్రోన్లతో పోలీసులు నిరంతరం నిఘా ఉంచుతున్నారు. బడా గణేష్‌ శోభాయాత్ర వీడియో చూడండి..
జై బోలో గణేష్ మహారాజ్‌కి.. ఖైరతాబాద్‌ మహా గణపతి వీడియో చూస్తే పూనకాలే..

ఖైరతాబాద్‌ బడా గణేష్‌ శోభాయాత్ర కొనసాగుతోంది. ఖైరతాబాద్‌ గణేషుడి శోభాయాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. శోభాయాత్రకు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంతరాలు రాకుండా పోలీసుల ముందస్తు చర్యలు తీసుకున్నారు. మధ్యాహ్నం 2 గంటకల్లా నిమజ్జనం పూర్తయ్యేలా ఏర్పాట్లు చేశారు. సీసీ, డ్రోన్ కెమెరాలతో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి నిరంతరం నిఘా ఉంచారు. బడా గణేష్‌ శోభాయాత్ర సెన్సేషన్‌ థియేటర్‌, టెలిఫోన్‌ భవన్‌ మీదుగా కొనసాగనుంది.. ఇక్బాల్ మినార్‌, తెలంగాణతల్లి చౌరస్తా.. ఎన్టీఆర్‌ మార్గ్‌ మీదుగా శోభాయాత్ర కొనసాగనుంది.. నిమజ్జనానికి ఎన్టీఆర్‌ మార్గ్‌ దగ్గర ఏర్పాట్లు చేశారు. క్రేన్‌ నెంబర్‌ 4 దగ్గర మహాగణపతి నిమజ్జనం జరగనుంది. కాగా.. ఖైరతాబాద్‌ గణేషుడి శోభాయాత్ర వీడియో వైరల్ అవుతోంది..

వీడియో చూడండి..

మరోవైపు, ఖైరతాబాద్ గణేశుని శోభాయాత్ర సాఫీగా సాగేందుకు బాలాపూర్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు ఉత్సవ సమితులు, వివిధ శాఖల అధికారులతో కలిసి సంయుక్త రూట్ తనిఖీలు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో రోడ్ల మరమ్మతులు, విద్యుత్ తీగల తొలగింపు, చెట్ల కొమ్మల కత్తిరింపు వంటి ఏర్పాట్లన్నీ పకడ్బందీగా పూర్తి చేశారు.

హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనోత్సవం

హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనోత్సవం కొనసాగుతోంది. నగరంలోని ప్రతీ బజారు, కాలనీ, మండపంలో తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న గణనాథులను భక్తులు శోభాయాత్రగా హుస్సేన్‌సాగర్‌కు నిమజ్జనం కోసం తరలిస్తున్నారు. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలన్నీ భక్తుల కోలాహలం, ‘జై బోలో గణేష్ మహారాజ్ కీ జై’ అనే నినాదాలతో మార్మోగుతున్నాయి. నగరవ్యాప్తంగా తరలివస్తున్న లక్షలాది విగ్రహాలతో నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా పరిసరాలు విద్యుత్ కాంతులతో శోభాయమానంగా మారాయి. భారీ జనసందోహం, వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులను విధించారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← IND vs WI: వెస్టిండీస్‌పై అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 భారత బౌలర్లు వీరే.. నంబర్ 1 ఎవరో తెలుసా?ఫుడ్ లవర్స్ కు బిగ్ షాక్.. హైదరాబాద్‌లో ఆ రెస్టారెంట్ల లైసెన్సులు రద్దు..! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com