☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Budameru Floods: బుడమేరులో పెరిగిన వరద ఉద్ధృతి.. అప్రమత్తమైన అధికారులు..

Budameru Floods: తీవ్ర వాయుగుండం తీరం దాటింది.. ఇక, ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి.. ఏపీతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది.. అయితే, ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి వద్ద బుడమేరులో వరద ఉధృతి పెరిగింది.. బుడమేరులో భారీగా వరద నీరు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గతంలో బుడమేరు వరదల సమయంలో ఎదురైన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. కొండపల్లి కవులూరు బ్రిడ్జి వద్ద బుడమేరు నిండుకుండలా ప్రవహిస్తోంది. […]
Budameru Floods: బుడమేరులో పెరిగిన వరద ఉద్ధృతి.. అప్రమత్తమైన అధికారులు..

Budameru Floods: తీవ్ర వాయుగుండం తీరం దాటింది.. ఇక, ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి.. ఏపీతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది.. అయితే, ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి వద్ద బుడమేరులో వరద ఉధృతి పెరిగింది.. బుడమేరులో భారీగా వరద నీరు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గతంలో బుడమేరు వరదల సమయంలో ఎదురైన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. కొండపల్లి కవులూరు బ్రిడ్జి వద్ద బుడమేరు నిండుకుండలా ప్రవహిస్తోంది.

పైనుంచి వస్తున్న వరద నీటితో బుడమేరులో ప్రవాహం పెరిగినప్పటికీ ప్రస్తుతం ఎలాంటి ముప్పు లేదని ఇరిగేషన్ ఏఈ వెంకటేష్ తెలిపారు. వరద పరిస్థితిని అధికారులు గంట గంటకూ పర్యవేక్షిస్తున్నారు. పైనుంచి వచ్చే వరద నీటిని చెరువులకు మళ్లించేలా చర్యలు చేపట్టారు. మరోవైపు పట్టిసీమ నుంచి 5 వేల క్యూసెక్కుల నీటిని కృష్ణా నదిలోకి విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కవులూరు బ్రిడ్జి వద్ద గతంలో గండ్లు పడిన ప్రాంతంలో నిర్మించిన రిటైనింగ్ వాల్ ప్రస్తుతం ధృఢంగా నిలిచింది. దీంతో ఆ ప్రాంతంలో ప్రత్యేకంగా పరిస్థితిని పరిశీలిస్తున్నారు.

పైనుంచి వస్తున్న వరద నీటి కారణంగా బుడమేరుకు ఎలాంటి ఇబ్బంది లేదని అధికారులు చెబుతున్నారు. మరోవైపు వరద ప్రవాహం కృష్ణా నదిలోని పాయల మధ్యగా కొనసాగుతోంది. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. కాగా, గతంలో బుడమేరు ఉప్పొంగడంతో విజయవాడలోని చాలా ప్రాంతాలు నీటమునిగిన విషయం విదితమే.. బుడమేరు దెబ్బకు భారీ నష్టాన్ని చవిచూడాల్సిన పరిస్థితి రాగా.. ఇప్పుడు, ముందే అప్రమత్తం అయ్యారు అధికారులు..

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Iran Trolls Trump: ట్రంప్‌ను టీజ్ చేసిన ఇరాన్.. బాలయ్య ‘భగవంత్ కేసరి’ క్లిప్‌తో కౌంటర్Nissan Pixo: నిస్సాన్ పిక్సో విడుదల.. 259KM రేంజ్‌, 10-అంగుళాల డిస్‌ప్లే, Gemini వాయిస్ అసిస్టెంట్.. ఫీచర్లు ఇవే →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com