☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
నరసాపురం మున్సిపాలిటీపై కూటమి జెండా ఎగరేస్తాం! • Gold-Silver Prices Today : పండుగ వేళ బంగారం ధరల్లో కీలక మార్పులు.. తులం రేటు ఎంతంటే? • దసరా తర్వాతే పట్టాలెక్కే ఛాన్స్ • ఘోర ప్రమాదం: కాలువలో పడిన మినీ బస్సు.. 8 మంది మృతి • అబ్బా వీటిని అనవసరంగా లైట్‌ తీసుకున్నామే.. జుట్టురాలడానికి అసలు కారణం ఈ అలవాట్లేనా? • Vaibhav Sooryavanshi: గంభీర్ ఛాన్స్ ఎప్పుడు ఇస్తారు? వైభవ్ సూర్యవంశీ రెండు పదాలతో చెప్పిన సమాధానం ఇదే • Tesla: ఫ్లయింగ్ కారు కేవలం శాంపిల్ మాత్రమే.. మస్క్ నెక్ట్స్ ఈ మూడు ప్రాజెక్టుల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..! • ట్రంప్ కీలక నిర్ణయం.. రష్యాపై చమురు ఆంక్షల్లో మినహాయింపులు? •

‘క్రేజీ కళ్యాణం’ మూవీ రివ్యూ

Crazy Kalyanam Review: ప్రస్తుతం టాలీవుడ్‌లో తెలంగాణ గ్రామీణ నేపథ్య కథల జోరు కొనసాగుతోంది. ఇదే కోవలో సరికొత్త పల్లెటూరి వాతావరణం, తెలంగాణ యాస, సంస్కృతీ సంప్రదాయాలను...
‘క్రేజీ కళ్యాణం’ మూవీ రివ్యూ

Crazy Kalyanam Review: ప్రస్తుతం టాలీవుడ్‌లో తెలంగాణ గ్రామీణ నేపథ్య కథల జోరు కొనసాగుతోంది. ఇదే కోవలో సరికొత్త పల్లెటూరి వాతావరణం, తెలంగాణ యాస, సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం ‘క్రేజీ కళ్యాణం’. అనుపమ పరమేశ్వరన్, అఖిల్ రాజ్, తరుణ్ భాస్కర్, నరేశ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా శుక్రవారం గ్రాండ్‌గా విడుదలైంది. మరి ఈ ‘క్రేజీ కళ్యాణం’ కథేంటి? ప్రేక్షకులను ఏ మేరకు అలరించింది? ఈ సమీక్షలో తెలుసుకుందాం.

‘క్రేజీ కళ్యాణం’ సినిమా కథాంశం

కథ విషయానికి వస్తే.. పర్వతాలు (నరేష్ వీకే) ఇద్దరు కూతుళ్లు. తన పెద్ద కూతురిని బాలరాజు (తరుణ్ భాస్కర్)కిచ్చి పెళ్లి చేస్తాడు. అయితే బాలరాజు ఎలాంటి పనిపాటా లేకుండా మద్యానికి బానిసై, ఊరిలో అప్పులు చేస్తూ ఇల్లరికం ఉంటూ నిత్యం గొడవలు సృష్టిస్తుంటాడు. దీంతో ఊరిలో తన పరువు పోయిందని, తల ఎత్తుకోలేకపోతున్నానని పర్వతాలు తీవ్ర ఆవేదన చెందుతుంటాడు. అందుకే తన చిన్న కూతురు కీర్తి (అనుపమ పరమేశ్వరన్)కి ఎలాంటి చెడు అలవాట్లు లేని మంచి ఇంట్ సంబంధం చూసి ఘనంగా పెళ్లి చేసి, కోల్పోయిన పరువును తిరిగి దక్కించుకోవాలని భావిస్తాడు.

Read also: Ranabali Movie: ‘రణబాలి’ తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే?

ఇందుకోసం తన అన్న కూతురికి కుదిరిన అమెరికా సంబంధాన్ని చెడగొట్టి, ఆ అబ్బాయికి కీర్తిని ఇచ్చి పెళ్లి చేయాలని ప్లాన్ వేస్తాడు. కానీ కీర్తి మాత్రం బాగా చదువుకుని ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి, తాను ప్రేమించిన అఖిల్ (ఉదయ్)ను వివాహం చేసుకోవాలని కలలు కంటుంది. తండ్రి ప్లాన్‌ను కీర్తి వ్యతిరేకించడంతో ఇద్దరి మధ్య ఘర్షణ మొదలవుతుంది. చివరికి కీర్తి తన ప్రభుత్వ ఉద్యోగ లక్ష్యాన్ని సాధించిందా? ఉదయ్‌తో ఆమె ప్రేమ పెళ్లి పీటలెక్కిందా? లేక తండ్రి బలవంతం చేసిన యూఎస్ అబ్బాయినే పెళ్లి చేసుకుందా? అన్నదే మిగతా అసలు కథ.

Crazy Kalyanam Review: తండ్రి-కూతురు అనుబంధం మరియు చక్కని సామాజిక సందేశం

ఈ సినిమా పూర్తిగా తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తండ్రి కూతుళ్ల మధ్య ఉండే అనుబంధం, ఒక అందమైన లవ్‌స్టోరి మరియు కుటుంబ భావోద్వేగాల కలయికగా సాగుతుంది. పరువు కోసం కూతురిని పెద్దింటికి పంపాలనుకునే తండ్రికి, స్వశక్తితో తన కాళ్లపై నిలబడాలని తపించే కూతురికి మధ్య జరిగే ఎమోషనల్ డ్రామానే ఈ చిత్రానికి ప్రధాన బలం. ప్రతి తండ్రి కూతురి పెళ్లి కోసం అప్పులు చేసి భారీగా ఖర్చు చేస్తుంటారని, ఆ డబ్బులో కొంత భాగం వారి ఉన్నత చదువులకు వెచ్చిస్తే వారు సొంత కాళ్లపై నిలబడగలరనే చక్కటి సందేశాన్ని దర్శకుడు ఈ కథలో జోడించారు.

సినిమా విశ్లేషణ: వినోదం మరియు భావోద్వేగాల ప్రయాణం

మొదటి సగానికి వస్తే, ఫస్టాఫ్‌లో పెద్దగా బలమైన కథ ఏమీ కనిపించకపోయినా సరదా సన్నివేశాలతో సాగిపోతుంది. అల్లుడు బాలరాజు వల్ల పర్వతాలు కుటుంబం పడే పాట్లు ప్రేక్షకులను నవ్విస్తాయి. అయితే ఉదయ్ – కీర్తిల లవ్‌స్టోరిలో కొత్తదనం ఏమీ ఉండదు. ఇక సెకండాఫ్‌లో కీర్తి తన ఉద్యోగం, ప్రేమను దక్కించుకోవడానికి చేసే ప్రయత్నాలే ఉంటాయి. అక్కడక్కడ కథ నెమ్మదించినా, సినిమాలోని చివరి 30 నిమిషాలు మరియు క్లైమాక్స్ సన్నివేశాలు మాత్రం ప్రేక్షకులను పూర్తిగా భావోద్వేగానికి గురిచేస్తాయి. ఓవరాల్‌గా ఈ సినిమా కాస్త ఫన్, కాస్త ఎమోషన్‌తో సాగుతుంది.

నటీనటుల పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది?

  • ఆత్మభిమానంతో, స్వయంకృషితో ఎదగాలనుకునే పల్లెటూరి అమ్మాయి కీర్తి పాత్రలో అనుపమ పరమేశ్వరన్ చాలా చక్కగా నటించింది. తెలంగాణ యాసలో మాట్లాడుతూ ఆ పాత్రకు పూర్తి ప్రాణం పోసింది.
  • ఉదయ్ పాత్రలో నటించిన అఖిల్కు పెద్దగా స్క్రీన్ స్పేస్ దక్కలేదు.
  • పర్వతాలు పాత్రలో నరేశ్ వీకే అద్భుతమైన నటన కనబరిచారు. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో ఆయన నటన కంటతడి పెట్టిస్తుంది.
  • ఇల్లరికం అల్లుడు బాలరాజుగా తరుణ్ భాస్కర్ నవ్వించే ప్రయత్నం చేశాడు. ఈ పాత్రను మరింత కామెడీగా మలిస్తే ఇంకా బాగుండేది.
  • దర్శకుడు భద్రప్ప ఎమోషనల్ సీన్లను తెరకెక్కించడంలో ప్రతిభ చూపించారు, అయితే రైటింగ్ పరంగా మరింత కసరత్తు చేసి ఉంటే సినిమా స్థాయి మరింత మెరుగ్గా ఉండేది.

రూరల్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ‘క్రేజీ కళ్యాణం’ సినిమా తెలంగాణ నేటివిటీ చిత్రాలు, ఫ్యామిలీ సెంటిమెంట్ కథలను ఇష్టపడే ప్రేక్షకులకు ఒక మోస్తరు మంచి అనుభూతిని పంచుతుంది.

Read Also hindi news: hindi.vaartha.com

దినపత్రికలు చదవండి

Epaper: epaper.vaartha.com

Read Also:

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← ఢిల్లీలో సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అరెస్ట్‌.. అసలేం జరిగింది?‘రణబాలి’పై కిషన్ రెడ్డి ప్రశంసలు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com