☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
చుక్క నూనె లేకుండా నోరూరించే చిల్లీ చికెన్.. రుచిలో మాత్రం తగ్గేదేలే • కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం • ఒకనాడు ఆటో ఎక్కనివ్వలేదని.. నేడు నాలుగు ఆటోలతో ఉచిత ప్రయాణం అందిస్తున్న ట్రాన్స్‌ జెండర్ • ఒమేగా 3 పుష్కలంగా ఉండి..గుండెకు మేలు చేసే బెస్ట్ చేపలు ఇవే! • Moral Stories: వ్యాపారిని ఉరి తీయాలనుకున్న రాజు.. రాజు చావు కోరిన వ్యాపారి.. • చలికాలంలో వేడివేడిగా, రెస్టారెంట్ రుచితో 30 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే.. • 106 రోజుల పాటు కుజ సంచారం.. సింహంతో సహా ఆ 5 రాశులకు ధన, కీర్తి యోగం! • శివ యోగం ప్రభావంతో ఈ రాశులకు ఈరోజు భారీ లాభాలు! •

Kushboo : పది కూడా చదవలేదు.. ఆ ఇద్దరు తెలుగు హీరోలే నాకు ఇంగ్లీష్ నేర్పించారు.. ఖుష్బూ..

ఖుష్బూ సుందర్ దక్షిణభారత సినీ పరిశ్రమలో ప్రముఖ నటి, నిర్మిత , రాజకీయ నాయకురాలు. 1980, 90ల కాలంలో తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ చిత్రాల్లో స్టార్ హీరోయిన్‌గా సుదీర్ఘకాలం ఏలి, అత్యంత ప్రజాదరణ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తూ సెకండ్ ఇన్నింగ్స్ లోనూ దూసుకుపోతున్నారు.
Kushboo : పది కూడా చదవలేదు.. ఆ ఇద్దరు తెలుగు హీరోలే నాకు ఇంగ్లీష్ నేర్పించారు.. ఖుష్బూ..

సినీ పరిశ్రమలో నటిగా, రాజకీయ నాయకురాలిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ఖుష్బూ సుందర్. ఇటీవల ఒక ప్రముఖ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో ఆమె తన వ్యక్తిగత, సినీ జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా తాను ఇంగ్లీష్ భాషను అంత ధారాళంగా , స్పష్టంగా మాట్లాడటానికి కారణం టాలీవుడ్ స్టార్ హీరోలు వెంకటేష్, నాగార్జున అని తెలిపారు. “మీరు ఎంతవరకు చదువుకున్నారు? ఇంత మంచి ఇంగ్లీష్ ఎలా నేర్చుకున్నారు?” అని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఖుష్బూ స్పందిస్తూ.. తాను పాఠశాల స్థాయిలో తొమ్మిదో తరగతిలోనే చదువును ఆపేశానని.. తొలినాళ్లలో తనకు ఇంగ్లీష్ భాషపై అంతగా పట్టు లేదని, మాట్లాడటానికి కొంత ఇబ్బంది పడేదాన్ని అని చెప్పారు. అయితే, తన కెరీర్ ఆరంభంలో తెలుగులో చేసిన మొదటి సినిమా దగ్గుబాటి వెంకటేష్‌తో, రెండవ సినిమా అక్కినేని నాగార్జునతో అని గుర్తు చేసుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Folk Song: అబ్బబ్బ ఏమున్నది పాట.. డీజేలో మోత మోగిపోతుందిగా.. వింటే స్టెప్పేయాల్సిందే..

ఆ సమయంలోనే వెంకటేష్, నాగార్జున ఇద్దరూ అమెరికాలో విద్యాభ్యాసం పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగొచ్చారని చెప్పారు. షూటింగ్ సమయంలో వారిద్దరితో సంభాషిస్తున్నప్పుడు, వారు తనతో ఇంగ్లీష్‌లోనే మాట్లాడాలని ప్రోత్సహించేవారని ఖుష్బూ తెలిపారు. “నువ్వు కచ్చితంగా ఇంగ్లీష్ మాట్లాడటం అలవాటు చేసుకోవాలి” అని వారు తనకు ధైర్యాన్ని ఇచ్చేవారని ఆమె చెప్పారు. అంతేకాకుండా, నాగార్జున గారు తనకు స్వయంగా ఒక ఇంగ్లీష్ నవల్ (పుస్తకం) కానుకగా ఇచ్చారని గుర్తు చేసుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా లవ్ స్టోరీ.. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్.. తెలుగులో పెద్ద డిజాస్టర్..

“ఈ పుస్తకాన్ని చదవడం ప్రారంభించు, ఇంగ్లీష్ నవల్స్ చదివితే భాషపై పట్టు వస్తుంది , ధారాళంగా మాట్లాడగలుగుతావు” అని నాగార్జున తనకు సలహా ఇచ్చారని పేర్కొన్నారు. ఆ విధంగా వెంకటేష్, నాగార్జున ఇచ్చిన ప్రోత్సాహం, నాగార్జున అందించిన పుస్తక పఠనం వల్లే తాను ఇంగ్లీష్ భాషను ఇంత బాగా నేర్చుకోగలిగానని ఖుష్బూ ఆనందం వ్యక్తం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..

వెంకటేశ్, నాగార్జున,..

Kushboo, Venkatesh, Nagarju

Kushboo, Venkatesh, Nagarju

ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..

⬇ Full News JPG⬇ Short News JPG
← భారత్‌పై 100% సుంకాలా? అమెరికాకు జేపీమోర్గాన్ సీఈఓ కీలక హెచ్చరిక!చేతిలో పేపర్.. కళ్ల ముందు గోల్డ్.. ఎవరికీ అనుమానం రాకుండా ప్యాకెట్ లేపేశాడు! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com