Sowcar janaki daughter:దివంగత ప్రముఖ నటి షావుకారు జానకి పెద్ద కుమార్తె యజ్ఞప్రభ చెన్నై నివాసంలో వీల్ చైర్ నుంచి జారిపడి తీవ్ర ఇబ్బంది పడ్డారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విషాదకర ఘటనల నేపథ్యంలో ఈ వార్త అందరినీ కలచివేసింది. షావుకారు జానకి కుమార్తె యజ్ఞప్రభ వయసు 76 సంవత్సరాలు. ఆమె ఇటీవల కాలికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ క్రమంలో చెన్నై దురైపాక్కం అపార్ట్మెంట్లో ఒంటరిగా విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Read also: Vijay-Rashmika: నెగటివ్ ప్రచారంపై సీరియస్.. పోలీసులను ఆశ్రయించిన విజయ్–రష్మిక టీమ్

ప్రమాదం జరిగిందిలా
యజ్ఞప్రభ సోమవారం ఉదయం బాత్రూమ్ కి వెళ్లి వస్తూ వీల్ చైర్ నుంచి ప్రమాదవశాత్తు కిందపడిపోయారు. కాలికి సర్జరీ జరగడంతో ఆమె పైకి లేవలేని నిస్సహాయ స్థితిలో చిక్కుకున్నారు. ఎంత గట్టిగా కేకలు వేసినా ఇంటి తలుపులు మూసి ఉండటంతో చుట్టుపక్కల వారికి ఎలాంటి శబ్దం వినిపించలేదు. ఎవరి సహాయం అందక పోవడంతో ఆమె ప్రాణాపాయ స్థితిని తలపించేలా గంటల తరబడి ఇబ్బంది పడ్డారు.
Sowcar janaki daughter:సెల్ ఫోన్ ద్వారా అప్రమత్తత
అతికష్టం మీద అక్కడికి పాకుంటూ వెళ్లి సెల్ ఫోన్ దగ్గరకు చేరుకున్నారు. వెంటనే తన బంధువులకు ఫోన్ చేసి జరిగిన ప్రమారాన్ని వివరించి సహాయం కోరారు. బంధువులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు తక్షణమే స్పందించి అపార్ట్మెంట్ తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. కిందికి పడిపోయి నొప్పితో బాధపడుతున్న యజ్ఞప్రభను సురక్షితంగా రక్షించి వైద్య సహాయం అందించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:


