Love And War Movie: బాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్ ‘లవ్ అండ్ వార్’ సినిమా నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ఈ చిత్రం నుంచి హీరోయిన్ ఆలియా భట్ ఫస్ట్ లుక్‌ను చిత్రయూనిట్ అధికారికంగా విడుదల చేసింది. “ఆగ్ భీ, దిల్ కీ జాన్ భీ!” అనే క్యాప్షన్‌తో విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటూ క్షణాల్లో వైరల్‌గా మారింది. పోస్టర్‌లో ఆలియా లుక్ చాలా పవర్‌ఫుల్‌గా, భావోద్వేగభరితంగా కనిపిస్తోంది.
Read Also : SPB Death Anniversary: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వర్ధంతి.. నివాళులర్పించిన వైఎస్ జగన్

Love And War Movie: సంజయ్ లీలా భన్సాలీ మార్క్ రొమాంటిక్ డ్రామా
దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఈ భారీ బడ్జెట్ రొమాంటిక్ డ్రామాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ఆలియా భట్‌తో పాటు బాలీవుడ్ స్టార్ హీరోలు రణ్‌బీర్ కపూర్, వికీ కౌశల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. భన్సాలీ మార్క్ విజువల్స్, అద్భుతమైన కథనంతో రూపుదిద్దుకుంటున్న ఈ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌పై పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
చిత్ర నిర్మాణ పనులు శరవేగంగా సాగుతుండటంతో, మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించారు. ఈ భారీ చిత్రాన్ని 2027 జనవరి 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు. రణ్‌బీర్, ఆలియా, వికీ కౌశల్‌ల కాంబినేషన్ వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :






