☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
వేగంగా దూసుకొస్తున్న కారు.. ఆపి చెక్ చేసిన పోలీసుల మైండ్‌బ్లాక్..! • అబీయేలోని మార్కెట్‌పై డ్రోన్ దాడి: 153 మంది మృతి • పేద విద్యార్థులకు కార్పొరేట్ స్కూళ్లలో సీట్లు • Son of Kanaka Durgamma : అమ్మవారి అవతారంలో లయ.. ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ పోస్టర్ అదిరిందిగా! • Ration Card : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. రేషన్ కార్డు ఉన్నవారికి భారీ శుభవార్త.. • సౌరవ్ దాస్,అశుతోష్ రాంకాలపై నమోదైన రెండో కేసు క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ • పోలీసు శాఖలో 7,437 పోస్టుల భర్తీకి అనుమతి.. సీఎం రేవంత్ కీలక ప్రకటన • ఏపీ మున్సిపల్ ఎన్నికలపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం.. ఎన్నికల సంఘానికి స్పష్టమైన ఆదేశాలు! •

AP Rains : బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..

AP Rains : ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శుక్రవారం నాటికి ఆగ్నేయ, ఆనుకుని ఉన్న తూర్పుమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఈ కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.
AP Rains : బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..

AP Rains : ఏపీలో గత నాలుగు రోజులుగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అయితే, వర్షాలపై వాతావరణ శాఖ తాజాగా బిగ్ అప్డేట్ ఇచ్చింది. వచ్చే వారం రోజుల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

Also Read : Dhanush Political Entry : తమిళనాడు రాజకీయాల్లోకి హీరో ధనుష్..? టీవీకే నేత కీలక కామెంట్స్..

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శుక్రవారం నాటికి ఆగ్నేయ, ఆనుకుని ఉన్న తూర్పుమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఆ తరువాత ఇది వాయవ్య దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం తెలిపారు. ఈ కారణంగా రాష్ట్రంలో వచ్చే వారం రోజుల్లో పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

ఉత్తరాంధ్ర వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో బుధవారం పోలవరం, కోనసీమ, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. వర్షాలతో పాటు భారీగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు ప్రజలకు సూచించారు. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్ లు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. వర్షాకాలంలో వర్షాలు ఆశించిన స్థాయిలో పడకపోవటంతో రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. వారం రోజుల్లో వర్షాలు కురిస్తే పంటలకు మేలు జరుగుతుందని రైతులు పేర్కొంటున్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Tirumala Letters: తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. డిసెంబర్ వరకు సిఫార్సు లేఖలు స్వీకరించరు.. కారణమిదే..Temba Bavuma : రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టిన దక్షిణాఫ్రికా కెప్టెన్.. ఆస్ట్రేలియాపై సరికొత్త రికార్డులు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com