☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కరవు ప్రాంతాల్లో గ్రామీణ కూలీలకు గుడ్‌న్యూస్.. 15 రోజుల్లో జాబ్‌కార్డులు • Viral Video: పిచ్చిదానిలా మారిన భార్యను రోడ్డుపై చూసి భర్త తట్టుకోలేక.. ఎలా ఏడ్చాడో చూడండి! వీడియో వైరల్ • వాస్తు ప్రకారం.. ఇంట్లో తులసి మొక్కను ఉంచకూడని ప్రదేశాలు • నేడు స్థిరంగా బంగారం ధరలు • అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ మహిళ మృతి • Sarpanch Suicide Attempt | ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వేధింపులు.. కరీంనగర్‌ జిల్లాలో సర్పంచ్ ఆత్మహత్యాయత్నం! • OTT Cinema : థియేటర్లలో సంచలనం.. ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ హిట్.. ఓటీటీలోకి వస్తున్న రూ.140 కోట్ల సినిమా.. • Video: ఒకే ఓవర్‌లో రెండు మిస్టేక్స్.. లక్కీ ఛాన్స్ ఇస్తే ఇలా చేశావేంట్రా..! •

కొడుకుకు మరణశిక్ష విధించాల‌ని తల్లి డిమాండ్!

మహారాష్ట్రలో ఓ వివాహితను బెదిరించి అఘాయిత్యానికి పాల్పడిన కేసులో నిందితుడిగా ఉన్న కానిస్టేబుల్‌ను ఉన్నతాధికారులు సర్వీసు నుంచి తొలగించారు. ఈ దారుణ ఘటనపై నిందితుడి తల్లి మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించారు. తన కుమారుడు గతంలోనూ చాలా మంది మహిళలను ఇలాగే వేధించాడని ఆమె ఆరోపించారు. ఎన్నో అరాచకాలకు పాల్పడిన తన కొడుకుకు కఠినంగా మరణశిక్ష (Death penalty) వేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. తన ఆస్తులను అక్రమంగా స్వాధీనం చేసుకొని తనను కూడా తీవ్రంగా […] The post కొడుకుకు మరణశిక్ష విధించాల‌ని తల్లి డిమాండ్! appeared first on Adya News Telugu.
కొడుకుకు మరణశిక్ష విధించాల‌ని తల్లి డిమాండ్!

మహారాష్ట్రలో ఓ వివాహితను బెదిరించి అఘాయిత్యానికి పాల్పడిన కేసులో నిందితుడిగా ఉన్న కానిస్టేబుల్‌ను ఉన్నతాధికారులు సర్వీసు నుంచి తొలగించారు. ఈ దారుణ ఘటనపై నిందితుడి తల్లి మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించారు. తన కుమారుడు గతంలోనూ చాలా మంది మహిళలను ఇలాగే వేధించాడని ఆమె ఆరోపించారు. ఎన్నో అరాచకాలకు పాల్పడిన తన కొడుకుకు కఠినంగా మరణశిక్ష (Death penalty) వేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. తన ఆస్తులను అక్రమంగా స్వాధీనం చేసుకొని తనను కూడా తీవ్రంగా వేధిస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఠాణే జిల్లా భీవండిలో సెప్టెంబర్‌ 13న ఓ వివాహితపై సామూహిక అత్యాచార ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ సంచలన కేసులో కానిస్టేబుల్‌ శైలేష్‌ పాటిల్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే నరేంద్ర పవార్‌లు ప్రధాన నిందితులుగా ఉన్నారు. బాధితురాలి నుదుటిపై తుపాకీ పెట్టి బెదిరించి, బలవంతంగా మద్యం తాగించి ఈ దురాగ్యానికి పాల్పడినట్లు తీవ్ర ఆరోపణలున్నాయి. ఈ కేసును విచారించిన స్థానిక కోర్టు.. మాజీ ఎమ్మెల్యేకు ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించింది. మరోవైపు సహ నిందితుడిగా ఉన్న కానిస్టేబుల్ శైలేష్‌ను అధికారులు ఇప్పటికే విధుల నుంచి (Dismissed Constable) శాశ్వతంగా తొలగించారు.

ఈ నేపథ్యంలో నిందితుడి తల్లి సులోచన పాటిల్ మీడియాతో మాట్లాడుతూ కొడుకు బండారాన్ని బయటపెట్టారు. కేవలం భీవండి కేసు మాత్రమే కాకుండా, తన కుమారుడు గతంలో అనేక మంది మహిళలను ఇలాగే మోసం చేసి వేధించాడని తెలిపారు. ఒక సీనియర్‌ ఐపీఎస్‌ అధికారిని కాపాడేందుకు గతంలో తన కొడుకు నెపాన్ని తనపై వేసుకొని జైలుకు కూడా వెళ్లాడని ఆమె చెప్పారు. ఆర్థర్‌ రోడ్ జైల్లో ఉన్న సమయంలో అతడికి కరుడుగట్టిన నేరస్థులతో పరిచయం పెరిగిందని, అప్పటినుంచే అతడిలో నేర ప్రవృత్తి మరింత పెరిగిందని వివరించారు.

శైలేష్‌ తనను కూడా తుపాకీతో బెదిరించి ఆస్తులన్నీ బలవంతంగా స్వాధీనం చేసుకున్నాడని సులోచన ఆరోపించారు. ఇలాంటి హేయమైన చర్యలకు పాల్పడుతున్న తన కుమారుడిని ఉరితీయాలని, తన ఆస్తులను తనకు ఇప్పించాలని ఆమె ఉన్నతాధికారులను కన్నీళ్లతో వేడుకున్నారు. తల్లి స్వయంగా తన కొడుకుపై చేసిన ఈ సంచలన ఆరోపణలు ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ, పోలీసు శాఖలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

The post కొడుకుకు మరణశిక్ష విధించాల‌ని తల్లి డిమాండ్! appeared first on Adya News Telugu.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← ‘జ‌గ‌నన్న సాయాన్ని ఎన్నటికీ మరిచిపోలేం’ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్‌ జామ్‌’.. బ్రెడ్‌, శాండ్‌విచ్‌లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com