☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

‘నోట్ల వర్షం’ కురిపిస్తామంటే పరుగెత్తిన జనం.. పోలీసుల ఎంట్రీతో బయటపడ్డ అసలు బండారం!

మహారాష్ట్ర అహల్యానగర్‌లో ఎల్‌సిబి పోలీసులు రూ.93 లక్షల నకిలీ కరెన్సీని పట్టుకున్నారు. డబ్బు రెట్టింపు చేస్తామని, నోట్ల వర్షం కురిపిస్తామని ప్రజలను మోసం చేస్తున్న ముఠాలోని ముగ్గురు నిందితులు అరెస్ట్ అయ్యారు. కేవలం రూ.25 వేలకు కొనుగోలు చేసిన ఈ నకిలీ నోట్లతో అమాయకులను ఆకర్షించి అసలు డబ్బు దోచుకుంటున్నారని దర్యాప్తులో తేలింది. తదుపరి విచారణ కొనసాగుతోంది.
‘నోట్ల వర్షం’ కురిపిస్తామంటే పరుగెత్తిన జనం.. పోలీసుల ఎంట్రీతో బయటపడ్డ అసలు బండారం!

మహారాష్ట్రలోని అహల్యానగర్‌లో ‘నోట్ల వర్షం’ కురిపిస్తామని, డబ్బులు రెట్టింపు చేస్తామని నమ్మించి ఘరానా మోసాలకు పాల్పడుతున్న ఒక కేటుగాళ్ల ముఠా గుట్టును లోకల్ క్రైమ్ బ్రాంచ్ (LCB) పోలీసులు రట్టు చేశారు. ఈ మెరుపు దాడిలో రూ. 93 లక్షల విలువైన నకిలీ భారతీయ కరెన్సీని స్వాధీనం చేసుకుని, ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.

MIDC పోలీస్ స్టేషన్ పరిధిలోని మాధవ్‌నగర్, వడ్గావ్ గుప్తా ప్రాంతంలో భారీగా నకిలీ కరెన్సీ నిల్వ ఉందన్న విశ్వసనీయ సమాచారంతో ఎల్‌సిబి పోలీసులు రంగంలోకి దిగారు. పక్కా వ్యూహంతో ఆ స్థావరంపై దాడులు జరిపి, బారామతి ప్రాంతానికి చెందిన గణేష్ షేవాలే, సుమిత్ చందన్‌శివే, సూరజ్ కాంబ్లేలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద సోదాలు చేయగా, అన్నీ రూ. 500 ముఖవిలువ కలిగిన రూ. 93 లక్షల నకిలీ నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఇంత పెద్ద మొత్తంలో నకిలీ కరెన్సీ దొరకడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

రూ. 25 వేలకే కొనుగోలు!

పోలీసుల ప్రాథమిక విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడయ్యాయి. మలేగావ్ నుంచి కేవలం రూ. 25,000 చెల్లించి ఈ రూ. 93 లక్షల నకిలీ కరెన్సీని కొనుగోలు చేసినట్లు నిందితులు అంగీకరించారు. గుప్త నిధులు, పూజల ద్వారా “డబ్బును రెట్టింపు చేస్తాం” లేదా “నోట్ల వర్షం కురిపిస్తాం” అని ప్రజలకు ఆశ చూపి మోసం చేసేవారని తేలింది. ఈ నకిలీ నోట్లను ప్రదర్శిస్తూ, మాయాజాలం పేరిట అమాయక భక్తులు మరియు ప్రజల నుండి అసలైన సొమ్మును గుంజేసేవారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

పరారీలో మరో ఇద్దరు – విచారణ తీవ్రతరం

ఈ కేసులో ముగ్గురు ప్రధాన నిందితులను అరెస్టు చేసినప్పటికీ, అహల్యానగర్ నగరానికి చెందిన మరో ఇద్దరు సహచరులు పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఈ నెట్‌వర్క్ ఎంత విస్తరించింది? ఇప్పటివరకు ఎంతమందిని మోసం చేశారు? ఈ నకిలీ నోట్లలో ఏవైనా చలామణిలోకి వెళ్లాయా? అన్న కోణాల్లో పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం.. షూటింగ్‌లో అదరగొట్టిన కైనన్-నీరూ జోడీతండ్రిని చిన్న వయసులోనే కోల్పోయాడు.. డబ్బంతా పోయింది..! కట్ చేస్తే ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com