☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
వేగంగా దూసుకొస్తున్న కారు.. ఆపి చెక్ చేసిన పోలీసుల మైండ్‌బ్లాక్..! • అబీయేలోని మార్కెట్‌పై డ్రోన్ దాడి: 153 మంది మృతి • పేద విద్యార్థులకు కార్పొరేట్ స్కూళ్లలో సీట్లు • Son of Kanaka Durgamma : అమ్మవారి అవతారంలో లయ.. ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ పోస్టర్ అదిరిందిగా! • Ration Card : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. రేషన్ కార్డు ఉన్నవారికి భారీ శుభవార్త.. • సౌరవ్ దాస్,అశుతోష్ రాంకాలపై నమోదైన రెండో కేసు క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ • పోలీసు శాఖలో 7,437 పోస్టుల భర్తీకి అనుమతి.. సీఎం రేవంత్ కీలక ప్రకటన • ఏపీ మున్సిపల్ ఎన్నికలపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం.. ఎన్నికల సంఘానికి స్పష్టమైన ఆదేశాలు! •

సదాశివపేట బస్టాండ్లో భారీ అగ్ని ప్రమాదం !

సదాశివపేట బస్టాండ్లో భారీ అగ్ని ప్రమాదం ! Caption of Image. సదాశివపేట: సంగారెడ్డి జిల్లా సదాశివపేట బస్టాప్లో అక్టోబర్ 20న రాత్రి సమయంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దాదాపు 5 షాపులు దగ్ధమైనట్లు పోలీసులు తెలిపారు. ఏపీలోని మార్కాపురం కనిగిరి గార్లపేట రోడ్డులో కూడా భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నాలుగు కార్పెంటర్ షాపులు అగ్నికి ఆహుతి కావడంతో స్థానికంగా విషాదం నెలకొంది. మంటలు అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ముమ్మర ప్రయత్నాలు చేశారు. పక్కనే ఉన్న ఇతర షాపులకు కూడా మంటలు వ్యాపించకుండా మంటలను ఆర్పేశారు. ఫైర్ సేఫ్టీ నింబంధనలు పాటించకపోవడం, షార్ట్‌‌ సర్క్యూట్‌‌ కారణంగానే 95 శాతం అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ప్రజల భద్రత కోసం ముఖ్యమైన మార్గదర్శకాలు ఇవే.. విద్యుత్ పనులన్నీ లైసెన్స్ పొందిన ఎలక్
సదాశివపేట బస్టాండ్లో భారీ అగ్ని ప్రమాదం !
సదాశివపేట బస్టాండ్లో భారీ అగ్ని ప్రమాదం !

సదాశివపేట: సంగారెడ్డి జిల్లా సదాశివపేట బస్టాప్లో అక్టోబర్ 20న రాత్రి సమయంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దాదాపు 5 షాపులు దగ్ధమైనట్లు పోలీసులు తెలిపారు. ఏపీలోని మార్కాపురం కనిగిరి గార్లపేట రోడ్డులో కూడా భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నాలుగు కార్పెంటర్ షాపులు అగ్నికి ఆహుతి కావడంతో స్థానికంగా విషాదం నెలకొంది.

మంటలు అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ముమ్మర ప్రయత్నాలు చేశారు. పక్కనే ఉన్న ఇతర షాపులకు కూడా మంటలు వ్యాపించకుండా మంటలను ఆర్పేశారు. ఫైర్ సేఫ్టీ నింబంధనలు పాటించకపోవడం, షార్ట్‌‌ సర్క్యూట్‌‌ కారణంగానే 95 శాతం అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి.

ప్రజల భద్రత కోసం ముఖ్యమైన మార్గదర్శకాలు ఇవే..

  • విద్యుత్ పనులన్నీ లైసెన్స్ పొందిన ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్లు, అనుమతి కలిగిన వారి పర్యవేక్షణలో, నైపుణ్యం కలిగిన వైర్‌‌మెన్‌‌ల ద్వారా జరగాలి.
  • లైటింగ్ సర్క్యూట్‌‌లకు 30ఎంఏ ఈఎల్​సీబీ/ఆర్​సీసీబీ, పవర్ సర్క్యూట్‌‌లకు 100ఎంఏ ఈఎల్​సీబీ అమర్చాలి.
  • విద్యుత్ వైరింగ్, ఇన్‌‌స్టాలేషన్‌‌లు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ రెగ్యులేషన్స్-2023, నేషనల్ ఎలక్ట్రికల్ కోడ్-2023, నేషనల్ బిల్డింగ్ కోడ్-2016, ఐఎస్​/ఐఈసీ ప్రమాణాలకు లోబడి ఉండాలి.
  • లైటింగ్‌‌కు 1.5 స్క్వేర్​ మిల్లీమీటర్, పవర్ పాయింట్లకు 2.5 స్క్వేర్​ మిల్లీమీటర్, ఏసీ యూనిట్లకు 4 స్క్వేర్​ మిల్లీమీటర్ ఉండే సరైన కేబుల్ సైజులను వాడాలి.
  • వోల్టేజ్ హెచ్చుతగ్గులున్న ప్రాంతాల్లో స్టెబిలైజర్లను ఉపయోగించాలి.
  • ఫైనల్ సబ్-సర్క్యూట్‌‌లు 10 పాయింట్లు లేదా 800 డబ్ల్యూ కంటే తక్కువగా ఉండాలి.
  • ఓవర్‌‌హీటింగ్ నివారణకు లోడ్‌‌ను సమతుల్యం చేయాలి.
  • హార్మోనిక్స్ ఉన్నచోట ఫిల్టర్లను అమర్చి, హై పవర్ ఫ్యాక్టర్‌‌ను నిర్వహించాలి.
  • ఒకే స్విచ్‌‌బోర్డ్‌‌కు బహుళ ఫేజ్‌‌లను కనెక్ట్ చేయకూడదు.
  • అత్యవసర సమయాల్లో సరఫరా నిలిపివేయడానికి ఐసోలేషన్ స్విచ్‌‌లను అందుబాటులో ఉంచాలి.
©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← తెలంగాణకు వాన కబురు.. ఇవాళ (అక్టోబర్ 21), రేపు (అక్టోబర్ 22) వానలే వానలు !జింబాబ్వేకు చుక్కలు చూపించిన షెఫాలీ, హర్మన్ ప్రీత్ కౌర్.. 92 రన్స్ తేడాతో గ్రాండ్ విక్టరీ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com