☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
వేగంగా దూసుకొస్తున్న కారు.. ఆపి చెక్ చేసిన పోలీసుల మైండ్‌బ్లాక్..! • అబీయేలోని మార్కెట్‌పై డ్రోన్ దాడి: 153 మంది మృతి • పేద విద్యార్థులకు కార్పొరేట్ స్కూళ్లలో సీట్లు • Son of Kanaka Durgamma : అమ్మవారి అవతారంలో లయ.. ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ పోస్టర్ అదిరిందిగా! • Ration Card : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. రేషన్ కార్డు ఉన్నవారికి భారీ శుభవార్త.. • సౌరవ్ దాస్,అశుతోష్ రాంకాలపై నమోదైన రెండో కేసు క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ • పోలీసు శాఖలో 7,437 పోస్టుల భర్తీకి అనుమతి.. సీఎం రేవంత్ కీలక ప్రకటన • ఏపీ మున్సిపల్ ఎన్నికలపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం.. ఎన్నికల సంఘానికి స్పష్టమైన ఆదేశాలు! •

OTT Movie: ఫస్ట్ నైట్‌కు ముందే వరుడి దారుణ హత్య.. ఓటీటీలో మలయాళం సూపర్ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్

ప్రస్తుతం మలయాళం సినిమాలకు ఉన్న క్రేజ్, ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మలయాళం సినిమా కూడా కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టింది. ఐఎమ్ డీబీలోనూ ఈ సినిమాకు 7.4 రేటింగ్ ఉండడం విశేషం.
OTT Movie: ఫస్ట్ నైట్‌కు ముందే వరుడి దారుణ హత్య.. ఓటీటీలో మలయాళం సూపర్ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్

మలయాళం మూవీస్‌కు తెలుగులోనూ సూపర్ క్రేజ్ ఉంది. లవ్, కామెడీ, క్రైమ్, యాక్షన్, కామెడీ, సస్పెన్స్, థ్రిల్లర్ ఇలా ఏ జానర్ సినిమాలైనా మలయాళం అంటే చాలు తెగ చూసేస్తున్నారు ఆడియెన్స్. ముఖ్యంగా ఓటీటీలో మలయాళం సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక మలయాళం సినిమా గురించే. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద మోస్తరు కలెక్షన్లు రాబట్టింది. ఆడియెన్స్ కు సరికొత్త థ్రిల్ ఎక్స్ పీరియెన్స్ ఇచ్చిన ఈ మలయాళం సినిమాకు ఐఎమ్ డీబీలోనూ 7.4 రేటింగ్ దక్కడం విశేషం. ఈ సినిమా స్టోరీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ‘ 36 ఏళ్ల లతీన్ కుమార్ అలియాస్ కుట్టన్ (సజిన్ గోపు) అనే వ్యక్తి చుట్టూ ఈ సినిమా స్టోరీ తిరుగుతుంది. శర్మిల (నిఖిలా విమల్) అనే అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు కుట్టన్. అయితే, ఫస్ట్ నైట్‌కు రెడీ అవుతుండగా… కుట్టన్‌ను కొందరు ముసుగు ధరించిన దుండగులు దారుణంగా హత్య చేస్తారు. అయితే, ఊహించని విధంగా కుట్టన్ చనిపోయిన మరుసటి రోజు ఉదయం అతను పెళ్లి రోజున నిద్ర లేస్తాడు. ప్రతీ రోజూ రాత్రి ఇదే టైమ్ లూప్‌లో సేమ్ ఘటన జరుగుతుంటుంది. కుట్టన్ కూడా ప్రతీ రోజూ చనిపోతూ మళ్లీ తర్వాతి రోజు నిద్ర లేస్తాడు. మరీ దీని వెనక ఉన్న మిస్టరీ ఏంటి?
కుట్టన్ ను చంపడానికి ప్రయత్నిస్తున్న ముసుగు దొంగలు ఎవరు? వీటిని చూసిన శర్మిల ఏం చేసింది? కుట్టన్ గతానికి దీనికి సంబంధం ఏమైనా ఉందా? చివరికి ఏమైంది? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

మలయాళంలో రీసెంట్‌గా రిలీజై సూపర్ హిట్ గా నిలిచిన సినిమా ధూమకేతు (Dhoomakethu). టైమ్ లూప్ సైన్స్ ఫిక్షన్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీలో సజిన్ గోపు, నిఖిలా విమల్ ప్రధాన పాత్రల్లో నటించారు. అలాగే, గణపతి, షైన్ టామ్ చాకో, సిద్దార్థ్ భరతన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సుధీ మాడిసన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. థియేటర్లలో సంచలన విజయం సాధించిన ధూమకేతు ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ శుక్రవారం ( అక్టోబర్ 23) నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఒరిజినల్ మలయాళం వెర్షన్ తో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులోకి రానుంది.

నెట్ ఫ్లిక్స్ లో మలయాళం సూపర్ హిట్ సినిమా..

View this post on Instagram

ధూమకేతు సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← ఏపీ మున్సిపల్ ఎన్నికలపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం.. ఎన్నికల సంఘానికి స్పష్టమైన ఆదేశాలు!Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు మరో షాక్.. ఐపీఎల్‌ 2027 వరకు క్రికెట్‌కు దూరం? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com