☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కాక్రోచ్ పార్టీ 2.0 అట్టర్ ఫ్లాప్ : ఎగతాళి చేస్తున్న బీజేపీ • Weather Report: తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. రాబోయే 3 రోజుల వాతావరణ ఎలా ఉండబోతుందంటే? • విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న సుస్మిత కొణిదెల • న్యాయవాదుల నిర్బంధంపై సీజేఐ జోక్యానికి SCBA విజ్ఞప్తి • Penguins: పెరుగుతున్న భూతాపం.. పిట్టల్లా రాలిపోతున్న పెంగ్విన్లు.. • నితిన్ కొత్త సినిమాలో..రుక్మిణీగా బాలీవుడ్ నటి? • తెలుగు అబ్బాయిలంటే ఇష్టం.. పెళ్లి కూడా చేసుకుంటా..! హీరోయిన్ క్రేజీ కామెంట్స్ • కాక్రోచ్ పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే నాయనమ్మ కన్నుమూత •

మృత్యుశయ్య పైనుంచి లేచి.. ఇంటికి తిరిగొచ్చి!

ఓ వ్యక్తి చనిపోయినట్టు వైద్యులు ప్రకటించాక, అకస్మాత్తుగా లేచి కూర్చున్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకున్నది. చందుర్తి మండలం సనుగులకు చెందిన చీకటి శంకరయ్య (66) అనారోగ్య సమస్యతో కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం నాలుగు రోజుల క్రితం కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ దవాఖానకు తరలించి చికిత్స కోసం రూ.80 వేల వరకు ఖర్చు చేశారు.
మృత్యుశయ్య పైనుంచి లేచి.. ఇంటికి తిరిగొచ్చి!
  • రాజన్న సిరిసిల్ల జిల్లా సనుగులలో ఘటన

చందుర్తి, సెప్టెంబర్‌ 26 : ఓ వ్యక్తి చనిపోయినట్టు వైద్యులు ప్రకటించాక, అకస్మాత్తుగా లేచి కూర్చున్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకున్నది. చందుర్తి మండలం సనుగులకు చెందిన చీకటి శంకరయ్య (66) అనారోగ్య సమస్యతో కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం నాలుగు రోజుల క్రితం కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ దవాఖానకు తరలించి చికిత్స కోసం రూ.80 వేల వరకు ఖర్చు చేశారు.

శనివారం శంకరయ్య మృతి చెందినట్టు వైద్యులు చెప్పడంతో. అంబులెన్స్‌లో స్వగ్రామానికి తీసుకొస్తున్న సమయంలో మార్గంమధ్యలో జోగాపూర్‌ గ్రామ సమీపంలో శంకరయ్య లేచి కూర్చున్నాడు. దీంతో అవాక్కైన కుటుంబసభ్యులు తిరిగి వేములవాడలోని ఓ ప్రైవేట్‌ దవాఖానకు తరలించగా, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నదని వైద్యులు వెల్లడించారు. అతడిని ఇంటికి తీసుకెళ్లగా చుట్టుపకల గ్రామస్తులు శంకరయ్యను చూసేందుకు తరలి వచ్చారు. కాగా తండ్రి ఆరోగ్యం విషమంగా ఉన్న వార్త విన్న ఇద్దరు కుమారులు గల్ఫ్‌ దేశం నుంచి స్వదేశానికి వచ్చారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← పూరి గుడిసెలు లేని రాష్ట్రంగా మార్చుతంTollywood : సినీ పరిశ్రమలో విషాదం.. బ్రెయిన్ స్ట్రోక్‌తో దర్శకుడి భార్య కన్నుమూత.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com