☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

ముఖానికి 20 కుట్లు, సర్జరీ.. కట్ చేస్తే ఆరు రోజులకే షూటింగ్.. హీరోయిన్ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే

చాలా మంది హీరోయిన్స్ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. చాలా మంది హీరోయిన్స్ గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉంటూ నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు ఎంచుకుంటున్నారు. అలాగే తమ డేడికేషన్ తో కట్టిపడేస్తున్నారు. అలాగే హీరోయిన్స్ కూడా షూటింగ్స్ లో గాయపడుతున్నారు.
ముఖానికి 20 కుట్లు, సర్జరీ.. కట్ చేస్తే ఆరు రోజులకే షూటింగ్.. హీరోయిన్ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే

తమిళ సినీ పరిశ్రమలో ప్రస్తుతం ‘మండాడి’ పేరు మార్మోగిపోతోంది. కమెడియన్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి హీరోగా ఎదిగిన సూరి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. సూరితో పాటు తెలుగు నటుడు సుహాస్, సీనియర్ నటుడు సత్యరాజ్ కీలక పాత్రల్లో కనిపించగా.. కథకు తగ్గట్టుగా తన నటనతో మెప్పించిన మహిమా నంబియార్ కూడా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నారు. సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విడుదలైన కొద్దిరోజుల్లోనే భారీ వసూళ్లను రాబట్టి రూ.100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టింది. అయితే ‘మండాడి’ విజయానికి సంబంధించిన చర్చలో ఇప్పుడు హీరోయిన్ మహిమా నంబియార్ పేరు ప్రత్యేకంగా వినిపిస్తోంది. కారణం.. సినిమా కోసం ఆమె చేసిన సాహసం, అంకితభావం. మండాడిలోని ‘ఉసురే నీదాన్ పుల్లా’ పాట చిత్రీకరణకు ముందు మహిమా నంబియార్ తీవ్ర రోడ్డు ప్రమాదానికి గురయ్యారట. ఈ విషయాన్ని స్వయంగా సినిమా దర్శకుడు మతిమారన్ సక్సెస్ మీట్‌లో వెల్లడించారు.

సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం రచ్చ రచ్చ.. ఈ అమ్మడు ఎవరో తెలుసా.?

ప్రమాదంలో మహిమా ముఖానికి తీవ్ర గాయాలు కావడంతో 20కి పైగా కుట్లు పడినట్లు దర్శకుడు తెలిపారు. పరిస్థితి చాలా క్లిష్టంగా ఉన్నప్పటికీ.. సినిమా షూటింగ్‌కు సంబంధించిన బాధ్యత ఆమెను మళ్లీ సెట్స్‌కి తీసుకొచ్చిందని చెప్పారు. ప్రమాదం తర్వాత మహిమా పరిస్థితిని చూసిన దర్శకుడు కూడా షాక్‌కు గురయ్యారట. షూటింగ్‌కు రావాలని ఆమెను అడగడం కూడా తనకు ఇబ్బందిగా అనిపించిందని మతిమారన్ పేర్కొన్నారు. అయితే కథలో కీలకమైన పాట చిత్రీకరణ ఆ సమయంలో జరగాల్సి ఉండటంతో మహిమా ఊహించని నిర్ణయం తీసుకున్నారట. ప్లాస్టిక్ సర్జరీ జరిగిన కేవలం ఆరో రోజుకే ఆమె తిరిగి షూటింగ్‌లో పాల్గొన్నారని దర్శకుడు తెలిపారు.

16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..! అప్పుడు తినడానికి తిండి లేక తిప్పలు.. ఇప్పుడు వందల కోట్లకు మహారాణి

ఇది మాములు విషయం కాదని, ఆ సమయంలో మహిమా చూపించిన ధైర్యం, వృత్తిపట్ల ఆమెకున్న డెడికేషన్ ఎప్పటికీ మర్చిపోలేమని మతిమారన్ ప్రశంసించారు. కేవలం శారీరకంగా మాత్రమే కాకుండా ‘మండాడి’లోని పాత్రను పోషించేందుకు మహిమా నంబియార్ మానసికంగానూ చాలా కష్టపడ్డారు. సినిమాలోని కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు తనను వ్యక్తిగతంగా కూడా ప్రభావితం చేశాయని ఆమె గతంలో చెప్పుకొచ్చారు. ఇక సినిమా విషయానికొస్తే కథ, నటీనటుల పెర్ఫార్మెన్స్, దర్శకుడి టేకింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ‘మండాడి’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.111.80 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిందని ట్రేడ్ వర్గాల లెక్కలు చెబుతున్నాయి.

స్టార్ హీరోలు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా 460 రోజులు థియేటర్లలో హౌస్‌ఫుల్.!

View this post on Instagram

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← AC Remote Buttons: ఏసీ రిమోట్‌లో ఈ బటన్స్ ఎందుకు? అసలు ఉపయోగాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!కాళ్లు, చేతులు, తల వేరు.. విజయవాడలో యువతి హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com