☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

TDP Office Attack Case : మంగళగిరి టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు సంచలన నిర్ణయం..

TDP Office Attack Case : మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
TDP Office Attack Case : మంగళగిరి టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు సంచలన నిర్ణయం..

TDP Office Attack Case : వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో 2021 అక్టోబర్ 19న మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడి కేసుకు సంబంధించి పలువురిపై కేసు నమోదైంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పలువురిపై కేసులు నమోదు చేయడంతోపాటు.. ఈ కేసుకు సంబంధించిన విచారణను పోలీసు అధికారులు వేగవంతం చేశారు. అయితే, తాజాగా ఏపీ పోలీసులు ఈ కేసుకు సంబంధించి సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Also Read: Fenugreek Rs 50 Fine : మెంతికూర తీసుకొచ్చాడని విద్యార్థికి రూ.50 జరిమానా.. స్కూల్ యాజమాన్యంకు బిగ్ షాకిచ్చిన విద్యాశాఖ

టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఉన్న వారందరిపైనా రౌడీషీట్ తెరవాలని నిర్ణయించారు. వైసీపీ ఎమ్మెల్సీ రఘురాం, దేవినేని అవినాశ్ సహా 51మందిపై రౌడీషీట్ తెరవాలని విజయవాడ సీపీ రాజశేఖరబాబు ఆదేశాలు జారీ చేశారు. రెండు రోజుల క్రితం విజయవాడలోని శాప్ కార్యాలయంపై దాడి కేసులో విజయవాడ పరిధిలోని మూడు పోలీస్ స్టేషన్ లలో పలువురిపై కేసులు నమోదయ్యాయి. అయితే, శాప్ కార్యాలయంపై దాడి కేసులోని పలువురు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నిందితులుగా ఉండటంతో వీరిపై రౌడీషీట్ తెరవాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Rakul Preet Singh : గ్రీస్ దేశంలో భర్తతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న రకుల్ ప్రీత్.. ఫొటోలు..Fenugreek Rs 50 Fine : మెంతికూర తీసుకొచ్చాడని విద్యార్థికి రూ.50 జరిమానా.. స్కూల్ యాజమాన్యంకు బిగ్ షాకిచ్చిన విద్యాశాఖ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com