☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

వరంగల్ ఎనుమాముల మార్కెట్ దగ్గర భారీ అగ్నిప్రమాదం

వరంగల్ ఎనుమాముల మార్కెట్ దగ్గర భారీ అగ్నిప్రమాదం Caption of Image. వరంగల్ జిల్లా: ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సమీపంలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మార్కెట్ సమీపంలోని సాయి ప్లాస్టిక్ కంపెనీలో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.ప్లాస్టిక్ వస్తువులు పెద్ద ఎత్తున దగ్ధం కావడంతో మంటలు వేగంగా వ్యాపించడంతో పాటు భారీగా పొగలు కమ్ముకున్నాయి. ప్లాస్టిక్ కాలిపోవడంతో వెలువడుతున్న ఘాటు వాసనతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. దట్టమైన పొగతో పరిసర ప్రాంతాల్లో భయాందోళన నెలకొంది. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిసరాల్లో పెద్ద సంఖ్యలో మిర్చి కోల్డ్ స్టోరేజీలు ఉన్నాయి. దీంతో అగ్నిప్రమాదం మరింత విస్తరించే అవకాశం ఉందేమోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తు
వరంగల్ ఎనుమాముల మార్కెట్ దగ్గర భారీ అగ్నిప్రమాదం
వరంగల్ ఎనుమాముల మార్కెట్ దగ్గర భారీ అగ్నిప్రమాదం

వరంగల్ జిల్లా: ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సమీపంలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మార్కెట్ సమీపంలోని సాయి ప్లాస్టిక్ కంపెనీలో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.ప్లాస్టిక్ వస్తువులు పెద్ద ఎత్తున దగ్ధం కావడంతో మంటలు వేగంగా వ్యాపించడంతో పాటు భారీగా పొగలు కమ్ముకున్నాయి. ప్లాస్టిక్ కాలిపోవడంతో వెలువడుతున్న ఘాటు వాసనతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. దట్టమైన పొగతో పరిసర ప్రాంతాల్లో భయాందోళన నెలకొంది.

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిసరాల్లో పెద్ద సంఖ్యలో మిర్చి కోల్డ్ స్టోరేజీలు ఉన్నాయి. దీంతో అగ్నిప్రమాదం మరింత విస్తరించే అవకాశం ఉందేమోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంటలు కోల్డ్ స్టోరేజీల వైపు వ్యాపించకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

అగ్నిప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న వెంటనే సంబంధిత సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, ఆస్తి నష్టం ఎంత మేరకు జరిగిందనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందా? లేదా మరేదైనా కారణం ఉందా అనే దానిపై అధికారులు దర్యాప్తు చేయనున్నారు.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో కూలిన సీలింగ్..హైదరాబాద్‌లో విదేశీయులపై పోలీసుల స్పెషల్ డ్రైవ్.. అక్రమంగా ఉంటున్న 49 మంది గుర్తింపు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com