☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
వేగంగా దూసుకొస్తున్న కారు.. ఆపి చెక్ చేసిన పోలీసుల మైండ్‌బ్లాక్..! • అబీయేలోని మార్కెట్‌పై డ్రోన్ దాడి: 153 మంది మృతి • పేద విద్యార్థులకు కార్పొరేట్ స్కూళ్లలో సీట్లు • Son of Kanaka Durgamma : అమ్మవారి అవతారంలో లయ.. ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ పోస్టర్ అదిరిందిగా! • Ration Card : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. రేషన్ కార్డు ఉన్నవారికి భారీ శుభవార్త.. • సౌరవ్ దాస్,అశుతోష్ రాంకాలపై నమోదైన రెండో కేసు క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ • పోలీసు శాఖలో 7,437 పోస్టుల భర్తీకి అనుమతి.. సీఎం రేవంత్ కీలక ప్రకటన • ఏపీ మున్సిపల్ ఎన్నికలపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం.. ఎన్నికల సంఘానికి స్పష్టమైన ఆదేశాలు! •

MBBS Student | హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని.. మెడికల్‌ విద్యార్థిని ఆత్మహత్య

MBBS Student | ఉత్తరప్రదేశ్‌ ముజఫర్‌నగర్‌లోని బెగరాజ్‌పూర్‌ మెడికల్‌ కళాశాలలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎంబీబీఎస్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న 24 ఏళ్ల విద్యార్థిని శగున్‌ సైనీ సోమవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది.
MBBS Student | హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని.. మెడికల్‌ విద్యార్థిని ఆత్మహత్య

MBBS Student | ఉత్తరప్రదేశ్‌ ముజఫర్‌నగర్‌లోని బెగరాజ్‌పూర్‌ మెడికల్‌ కళాశాలలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎంబీబీఎస్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న 24 ఏళ్ల విద్యార్థిని శగున్‌ సైనీ సోమవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. కళాశాల హాస్టల్‌లోని గదిలో ఆమె మృతదేహం ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించడంతో కంగారుపడిన తోటి విద్యార్థులు, సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

ముజఫర్‌నగర్‌ జిల్లా మన్‌సూర్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బెగరాజ్‌పూర్‌ మెడికల్‌ కళాశాల హాస్టల్‌లో ఈ ఘటన జరిగింది. శగున్‌ గది తలుపు లోపలి నుంచి మూసి ఉండటంతో పాటు ఎంత పిలిచినా డోర్ తీయకపోవడంతో తోటి విద్యార్థులు, భద్రతా సిబ్బందికి అనుమానం వచ్చింది. వెనుకవైపు కిటికీలో నుంచి చూడగా ఆమె ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫోరెన్సిక్‌ బృందం ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గది తలుపును తెరిచి మృతదేహాన్ని కిందకు దించి, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

శగున్ తరచూ ఫోన్‌లో ఓ ఫ్రెండ్‌తో గొడవపడేదని ఆమె రూంమేట్ పోలీసులకు తెలిపింది. ఘటనాస్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదని పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Cricketer Jehangir | అభిమానిని కిందపడేసి చితకబాదిన క్రికెటర్‌.. వీడియో వైరల్‌!Viraajita : పండ‌గ పూట చీర‌క‌ట్టులో యూట్యూబ‌ర్ విరాజిత‌.. ఎంత క్యూట్‌గా ఉందో.. ఫోటోలు వైర‌ల్.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com