☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Telangana Rains : తెలంగాణలో మళ్లీ వర్షాలు.. ఈ జిల్లాల్లో నేడు, రేపు దంచికొట్టనున్న వానలు.. హెచ్చరికలు జారీ..

Telangana Rains : బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పులు, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే వారం రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
Telangana Rains : తెలంగాణలో మళ్లీ వర్షాలు.. ఈ జిల్లాల్లో నేడు, రేపు దంచికొట్టనున్న వానలు.. హెచ్చరికలు జారీ..

Telangana Rains : తెలంగాణలో గతవారం దంచికొట్టిన వర్షాలు.. ప్రస్తుతం ముఖం చాటేశాయి. గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగింది. ఎండల తీవ్రతతోపాటు ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు.. పంటలు సాగుచేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. గత నెలతో నైరుతి నిష్ర్కమించింది.. ఈ వర్షాకాలం సీజన్లో ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదు.. అత్యధిక జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. ఈ పరిస్థితుల్లో రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రజలతోపాటు అన్నదాతలు వర్షాలకోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ వర్షాలపై బిగ్ అప్డేట్ ఇచ్చింది.

Also Read : Telangana Government : తెలంగాణ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. ఒక్కొక్కరికి తులం గోల్డ్ పంపిణీ? ముహూర్తం ఫిక్స్..

తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆదివారం వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఉత్తర, తూర్పు జిల్లాలైన అదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. మిగిలిన దక్షిణ, పశ్చిమ జిల్లాల్లో పొడి వాతావరణం కొనసాగనుందని, అక్కడక్కడా చిరుజల్లులు పడే అవకాశముందని అధికారులు తెలిపారు. హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో నేడు ఆకాశం మేఘావృతమై ఉంటుందని అంచనా వేశారు.

మరోవైపు.. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పులు, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే వారం రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని, ఇది క్రమంగా బలపడి అక్టోబర్ 5, 6 తేదీల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

ఈ క్రమంలో ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది.

వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్ లు ఉన్న ప్రాంతల్లో ఉండొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Divi : తిరుమ‌ల‌లో న‌టి దివి.. ఫోటోలు వైర‌ల్‌..Singeetham Srinivasa Rao : టాలీవుడ్‌లో విషాదం.. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సింగీతం శ్రీనివాస‌రావు క‌న్నుమూత‌ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com