☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

AP Rains Alert : ఏపీని వీడని వానలు.. నేడు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ..

AP Rains Alert : ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
AP Rains Alert : ఏపీని వీడని వానలు.. నేడు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ..

AP Rains Alert : ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా గత నాలుగు రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. వాయుగుండం తీరం దాటడంతో ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టాయి. అయితే, వర్షాలపై తాజాగా వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. నేడు (ఆదివారం) పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Also Read : AP Schemes: ఏపీలోని రైతులకు భారీ శుభవార్త చెప్పిన కూటమి సర్కార్.. బ్యాంక్ అకౌంట్లలోకి డబ్బులు వచ్చేస్తున్నాయ్..

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలో ఇవాళ శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గత నాలుగు రోజులుగా కురిసన వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నదులు, వాగులు, పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో వాగులు, కాజ్‌వేలు దాటే క్రమంలో ప్రజలు, ప్రయాణికులు జాగ్రత్తలు తీసుకోవాలని.. వరద నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటే వాగులు, కాజ్‌వేలు దాటొద్దని అధికారులు సూచించారు.

మరోవైపు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి నదికి స్వల్ప వరద పెరుగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ధవళేశ్వరం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో/ఔట్ ఫ్లో 5.19 లక్షల క్యూసెక్కులు కాగా.. ఆదివారం వరద ప్రవాహం 8 నుంచి 9లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉందని, ఆ తరువాత క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అంచనా వేశారు.

వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్ లు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.

⬇ Full News JPG⬇ Short News JPG
← Chiranjeevi : హైట్ ఎక్కువ అని మెగాస్టార్ సినిమానే రిజెక్ట్ చేసిన హీరోయిన్..?Jyothika Munirathnam : ‘గుండెనిండా గుడిగంటలు’ నటి.. సీరియల్ లో పద్దతిగా.. బయట బోల్డ్ గా.. ఫొటోలు.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com