☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Minister Atchannaidu: తుఫాన్ ఎఫెక్ట్.. అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు

Minister Atchannaidu: తీవ్ర వాయుగుండం తీరం దాటిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభావిత ప్రాంతాల్లో పంటలకు జరిగిన నష్టాన్ని తక్షణమే అంచనా వేసి, వివరాల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటలపై క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టాలని మంత్రి సూచించారు. వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు వెంటనే […]
Minister Atchannaidu: తుఫాన్ ఎఫెక్ట్.. అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు

Minister Atchannaidu: తీవ్ర వాయుగుండం తీరం దాటిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభావిత ప్రాంతాల్లో పంటలకు జరిగిన నష్టాన్ని తక్షణమే అంచనా వేసి, వివరాల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటలపై క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టాలని మంత్రి సూచించారు. వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు వెంటనే పొలాలను సందర్శించి పంటల పరిస్థితిని పరిశీలించాలని ఆదేశించారు. ముఖ్యంగా నీరు నిలిచిన పొలాల్లో పంటలను రక్షించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.

పొలాల్లో నిల్వ ఉన్న వర్షపు నీటిని వీలైనంత త్వరగా తొలగించాలని, అధిక తేమ కారణంగా పంటలకు మరింత నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు సూచించారు. రైతులకు పంటల రక్షణకు సంబంధించిన సాంకేతిక సూచనలు అందించాలని అధికారులను ఆదేశించారు. పంట నష్టాలకు సంబంధించిన వివరాల నమోదు ప్రక్రియను వేగవంతం చేసి, క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలియజేయాలని మంత్రి సూచించారు. అదే సమయంలో వర్షపు నీటి సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, భవిష్యత్ సాగు అవసరాలకు వర్షపు నీటిని సమర్థంగా వినియోగించేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్య శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అచ్చెన్నాయుడు ఆదేశించారు. ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు అందుబాటులో ఉండి రైతులకు అవసరమైన సహాయం, సాంకేతిక మార్గదర్శకాలు అందించాలని సూచించారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Minapa Jantikalu: నూనె పీల్చకుండా, నెల రోజులు క్రిస్పీగా శెనగపిండి లేకుండానే కరకరలాడే “మినప జంతికలు” చేసేయండి ఇలా..!How to Choose Sweet Apples: యాపిల్ కొనేటప్పుడు రంగు చూసి మోసపోవద్దు.. తియ్యటి పండు కోసం సింపుల్ చిట్కాలు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com