☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Nadendla Manohar: ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. కల్లాల నుంచే ధాన్యం సేకరణ, రైతులకు రవాణా ఛార్జీలు.. మంత్రి కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ లో ఖరీఫ్ సీజన్‌ ధాన్యం సేకరణ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించనున్నట్లు ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) ప్రకటించారు.
Nadendla Manohar: ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. కల్లాల నుంచే ధాన్యం సేకరణ, రైతులకు రవాణా ఛార్జీలు.. మంత్రి కీలక ప్రకటన

Nadendla Manohar: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి నవంబర్ 1వ తేదీ నుంచి ధాన్యం సేకరణ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించనున్నట్లు ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) ప్రకటించారు. పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వర్క్‌షాప్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సారి రైతులు ఎదుర్కొనే ఇబ్బందులను తొలగించి, సజావుగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల ముందస్తు చర్యలు చేపడుతోందని స్పష్టం చేశారు.

Ambati Rambabu: ఏపీ లిక్కర్ కేసులో బిగ్ ట్విస్ట్.. అంబటి రాంబాబుకు మరోసారి ఈడీ నోటీసులు.. విచారణపై ఉత్కంఠ

37 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యం – 2,619 కొనుగోలు కేంద్రాలు:

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఎల్‌నినో ప్రభావం వల్ల ఈ ఏడాది సేకరణ అంచనా కొంత తగ్గిందని వివరించారు. రైతుల సౌకర్యార్థం 2,619 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, సేకరణ ప్రక్రియను పర్యవేక్షించేందుకు 24 వేల మంది సిబ్బందిని ప్రత్యేకంగా నియమిస్తున్నామని పేర్కొన్నారు.

రైతులకు ఉచిత రవాణా వెసులుబాటు – 31 వేల వాహనాలు సిద్ధం:

ధాన్యాన్ని కల్లాల నుంచి నేరుగా మిల్లులకు చేరవేసేందుకు వీలుగా 31 వేల రవాణా వాహనాలను అందుబాటులో ఉంచినట్లు మంత్రి చెప్పారు. ఈసారి రైతులపై పైసా భారం పడకుండా, రవాణా ఖర్చులను సైతం ప్రభుత్వమే నేరుగా చెల్లించేలా పక్కా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. అన్ని శాఖల సమన్వయంతో సేకరణను విజయవంతం చేయడానికే ఈ వర్క్‌షాప్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Yanamala Krishnudu: వైసీపీ పార్టీకి యనమల కృష్ణుడు రాజీనామా.. తుని రాజకీయంలో సంచలనంఆన్సర్ కీ విడుదల.. మీ మార్కులు ఇలా చెక్ చేసుకోండి →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com