☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Mohanlal : మోహన్ లాల్- జీతూ జోసెఫ్ క్రేజీ ప్రాజెక్ట్ రీ – ఓపెన్

మాలీవుడ్ దర్శకుల్లో థ్రిల్లర్‌ సినిమా అనగానే టక్కున గుర్తొచ్చే దర్శకుడు జీతూ జోసెఫ్. దృశ్యం సినిమాతో సౌత్‌లో మాత్రమే కాదు టోటల్‌ ఇండియాలోనే ఫేమస్‌ అయ్యాడు.. ఈ స్టార్ దర్శకుడు. కానీ మోహన్ లాల్‌ను దాటి వెళ్లలేకపోతున్నాడు. నేరు తర్వాత మూడు సినిమాలు తీస్తే.. రెండు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. దృశ్యం3 మళ్లీ అతడ్ని లైమ్ లైట్‌లో నిలిచేలా చేసింది. దీంతో కంప్లీట్ స్టార్‌ను వదిలిపెట్టడం లేదు. ఈ ఇద్దరి కాంబోలో దృశ్యం4 ఉందా లేదా […]
Mohanlal : మోహన్ లాల్- జీతూ జోసెఫ్ క్రేజీ ప్రాజెక్ట్ రీ – ఓపెన్

మాలీవుడ్ దర్శకుల్లో థ్రిల్లర్‌ సినిమా అనగానే టక్కున గుర్తొచ్చే దర్శకుడు జీతూ జోసెఫ్. దృశ్యం సినిమాతో సౌత్‌లో మాత్రమే కాదు టోటల్‌ ఇండియాలోనే ఫేమస్‌ అయ్యాడు.. ఈ స్టార్ దర్శకుడు. కానీ మోహన్ లాల్‌ను దాటి వెళ్లలేకపోతున్నాడు. నేరు తర్వాత మూడు సినిమాలు తీస్తే.. రెండు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. దృశ్యం3 మళ్లీ అతడ్ని లైమ్ లైట్‌లో నిలిచేలా చేసింది. దీంతో కంప్లీట్ స్టార్‌ను వదిలిపెట్టడం లేదు. ఈ ఇద్దరి కాంబోలో దృశ్యం4 ఉందా లేదా అన్నది ప్రస్తుతానికి డౌటే కానీ ఎప్పుడో ఎనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ రామ్ సినిమాకు మోక్షం లభించింది.

2020లో జీతూ- మోహన్ లాల్ రామ్ మూవీని ఎనౌన్స్ చేశారు. మొదట కరోనా వల్ల డిలే అయితే.. నిర్మాతలకు ఆర్థిక ఇబ్బందులు, నిధుల సమస్యల వల్ల ప్రాజెక్ట్ హోల్ట్ అవుతూ వచ్చింది. సమస్యలన్నీ సాల్వ్ కావడంతో ఆరేళ్ల తర్వాత తాజాగా రీస్టార్టైంది. త్రిష అండ్ సంయుక్త హీరోయిన్స్‌గా నటిస్తోన్న ఈ యాక్షన్ థ్రిల్లర్ టూ పార్ట్స్‌గా తెరకెక్కుతోంది. ఇందులో ప్రియమణి కీ రోల్ ప్లే చేస్తోంది. రీసెంట్లీ క్లాప్ బోర్డ్ పట్టుకున్న ఫోటోలను షేర్ చేసింది ప్రియమణి. స్టార్ హీరోలు ఒక్క సినిమా కంప్లీట్ చేసేందుకు ఏళ్లకు ఏళ్లు తీసుకుంటుంటే.. మోహన్ లాల్ మాత్రం చకా చకా సినిమాలు ఫినిష్ చేస్తూ.. థియేటర్స్‌లోకి తీసుకు వచ్చేస్తున్నాడు. ఇవి సరిపోవనట్లు క్యామియోలతో కూడా ఎంటర్టైన్ చేస్తున్నాడు లాలట్టన్. ఈ ఏడాది ఇప్పటికే ఆయన నుండి త్రీ మూవీస్ వచ్చాయి. ఇందులో దృశ్యం3 ఫుల్ ఫ్లెడ్జ్ మూవీ. మిగిలినవీ క్యామియోకి మించిన రోల్స్. ప్రస్తుతం ఆయన చేతిలో ఏడెనిమిది సినిమాలున్నాయి. ఆయన లైనప్, స్పీడ్ చూసైనా స్టార్ హీరోలు నేర్చుకుంటారేమో చూడాలి.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← IRDAI New Insurance Rules: హెల్త్, మోటార్ ఇన్సూరెన్స్‌పై IRDAI కొత్త ప్రతిపాదనలు.. పాలసీదారులకు ఏమి మారనుంది?IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com