☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
చుక్క నూనె లేకుండా నోరూరించే చిల్లీ చికెన్.. రుచిలో మాత్రం తగ్గేదేలే • కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం • ఒకనాడు ఆటో ఎక్కనివ్వలేదని.. నేడు నాలుగు ఆటోలతో ఉచిత ప్రయాణం అందిస్తున్న ట్రాన్స్‌ జెండర్ • ఒమేగా 3 పుష్కలంగా ఉండి..గుండెకు మేలు చేసే బెస్ట్ చేపలు ఇవే! • Moral Stories: వ్యాపారిని ఉరి తీయాలనుకున్న రాజు.. రాజు చావు కోరిన వ్యాపారి.. • చలికాలంలో వేడివేడిగా, రెస్టారెంట్ రుచితో 30 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే.. • 106 రోజుల పాటు కుజ సంచారం.. సింహంతో సహా ఆ 5 రాశులకు ధన, కీర్తి యోగం! • శివ యోగం ప్రభావంతో ఈ రాశులకు ఈరోజు భారీ లాభాలు! •

తాగుబోతులకు సరికొత్త రోల్ మోడల్..

జార్ఖండ్ రాజధాని రాంచీలో ఒక వింత సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాంచీలోని ఓర్మాంజి ప్రాంతంలో సెప్టెంబర్ 26న చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికులను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక ఆడ కోతి నేరుగా స్థానిక వైన్ షాప్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. షాప్‌లోని బీర్లు, మద్యం బాక్సులెక్కి హల్ చల్ చేసింది. అంతటితో ఆగకుండా ఒక వోడ్కా బాటిల్‌ను ఓపెన్ చేసి అందులోని మద్యాన్ని తాగింది. ఆ తర్వాత మత్తు ఎక్కడంతో అక్కడే మద్యం కార్టన్ల […] The post తాగుబోతులకు సరికొత్త రోల్ మోడల్.. appeared first on Adya News Telugu.
తాగుబోతులకు సరికొత్త రోల్ మోడల్..

జార్ఖండ్ రాజధాని రాంచీలో ఒక వింత సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాంచీలోని ఓర్మాంజి ప్రాంతంలో సెప్టెంబర్ 26న చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికులను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక ఆడ కోతి నేరుగా స్థానిక వైన్ షాప్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. షాప్‌లోని బీర్లు, మద్యం బాక్సులెక్కి హల్ చల్ చేసింది.

అంతటితో ఆగకుండా ఒక వోడ్కా బాటిల్‌ను ఓపెన్ చేసి అందులోని మద్యాన్ని తాగింది. ఆ తర్వాత మత్తు ఎక్కడంతో అక్కడే మద్యం కార్టన్ల మీద నిద్రపోయింది. షాప్ సిబ్బంది ఆ కోతిని బయటకు తరిమేందుకు ప్రయత్నించగా, అది కాస్తా షాప్ యజమానిని కరిచింది. గర్భిణిగా ఉన్నట్లు చెబుతున్న ఆ కోతి మద్యం సేవించి అలా నిద్రపోవడంతో అక్కడివారంతా అవాక్కయ్యారు.

ఈ వింత ఘటనపై సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ వెంటనే అక్కడికి చేరుకుంది. ఎంతో జాగ్రత్తగా ఆ కోతిని సురక్షితంగా బయటకు వెలికితీశారు. ఈ అరుదైన ఘటనకు సంబంధించిన వీడియోను ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్ @Rainmaker1973 షేర్ చేయడంతో క్షణాల్లో వైరల్ అయింది. పట్టణ ప్రాంతంలో కోతి చేసిన ఈ ఊహించని ‘షాపింగ్’ ట్రిప్ చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

The post తాగుబోతులకు సరికొత్త రోల్ మోడల్.. appeared first on Adya News Telugu.

⬇ Full News JPG⬇ Short News JPG
← నవంబర్‌ రెండో వారంలో కాళేశ్వరం పనులు ప్రారంభం.. మంత్రి ఉత్తమ్‌ఓనం జాక్‌పాట్‌.. రూ.30 కోట్ల లాట‌రీ! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com