☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Prahaar Trailer | ముంబై టెరర్ అటాక్స్ నేపథ్యంలో రాజ్ కుమార్ రావు కొత్త సినిమా.. ఆసక్తికరంగా ‘ప్రహార్’ ట్రైలర్!

Prahaar | బాలీవుడ్ ప్రముఖ నటుడు రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'ప్రహార్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ఉజ్వల్ నికమ్.
Prahaar Trailer | ముంబై టెరర్ అటాక్స్ నేపథ్యంలో రాజ్ కుమార్ రావు కొత్త సినిమా.. ఆసక్తికరంగా ‘ప్రహార్’ ట్రైలర్!

బాలీవుడ్ ప్రముఖ నటుడు రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ప్రహార్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ఉజ్వల్ నికమ్’ (Prahaar: The Untold Story of Ujjwal Nikam). దేశాన్ని షాక్‌కి గురిచేసిన ముంబై ఉగ్రరూప దాడుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ట్రైలర్ తాజాగా విడుదలైంది. దేశం గర్వించదగ్గ ప్రముఖ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ముఖ్యంగా 26/11 ముంబై ఉగ్రదాడి సమయంలో అజ్మల్ కస‌బ్ కేసుకు సంబంధించి ఆయన చేపట్టిన సాహసోపేతమైన వాదనలు, కోర్టు రూమ్ డ్రామా మరియు ఆయన వ్యక్తిగత జీవితంలోని ముఖ్య ఘట్టాలను ఈ చిత్రంలో చూపించనున్నారు.

ఈ బయోపిక్‌లో ఉజ్వల్ నికమ్ పాత్రలో టాలెంటెడ్ యాక్టర్ రాజ్ కుమార్ రావు తన నటనతో మెప్పించనున్నారు. ఆయన సరసన వామికా గబ్బి ప్రధాన పాత్రలో నటిస్తుండగా, జైదీప్ అహ్లావత్, సికందర్ ఖేర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అవినాష్ అరుణ్ ధవారే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండ‌గా.. ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాడాక్ ఫిల్మ్స్ (Maddock Films) పతాకంపై దినేష్ విజన్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 16, 2026 న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Sircilla | రేవంత్ సారూ.. విమర్శలు కాదు.. సమస్యల పరిష్కారం కావాలి.. సీఎం పర్యటన నేపథ్యంలో సిరిసిల్ల ప్రజల విజ్ఞప్తిUrvashi Rautela | ఊర్వశి రౌతేలా వర్సెస్ ఏఐ కంపెనీ.. రూ.7 వేల కోట్ల దావా, సీఈఓ ఘాటు కౌంటర్‌తో రచ్చ! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com