
పెసలు, భారతీయ సంస్కృతిలో ప్రాచీన కాలం నుండి ఆహారంలో ఒక ముఖ్యమైన భాగంగా ఉన్నాయి. మన పూర్వీకుల నుండి వారసత్వంగా వచ్చిన ఈ చిరుధాన్యం, నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. మనకంటే ఎక్కువగా చైనాలో పెసలను ఉపయోగిస్తారు. వేడిని తగ్గించే గుణం ఉండటం వలన వడదెబ్బ, చెమటకాయలు, దద్దుర్లు వంటి సమస్యలకు ఇది విరుగుడుగా పనిచేస్తుందని చైనీయులు నమ్ముతారు. ఆహారంలో విషదోషాలు ఏర్పడినప్పుడు ఇది విరుగుడుగా పనిచేస్తుందని కూడా వారి నమ్మకం. పెసలు కేవలం రుచికరమైనవే కాదు, అవి పోషక విలువలతో నిండిన ఆరోగ్య ప్రదాత. ప్రోటీన్లు, కాల్షియం, ఫాస్పరస్, అనేక ముఖ్యమైన విటమిన్లను కలిగి ఉన్న పెసలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

అద్భుతమైన పోషక విలువలు: ముడి పెసళ్లలో విటమిన్లు, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. ఉడికించిన పెసళ్లలో 100 కేలరీల కంటే తక్కువగా ఉంటాయి.. ఇది ఆరోగ్యకరమైన ఆహారానికి ఉత్తమ ఎంపిక. ఇవి శరీరాన్ని రోగాల నుండి రక్షించడమే కాకుండా, చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాయి. అందుకే.. పెసలను ఉడకబెట్టి తినొచ్చు.. ఇంకా.. పలు రకాల టిఫిన్లను కూడా తీసుకోవచ్చు..

బరువు నియంత్రణలో పెసల పాత్ర: బరువు తగ్గాలనుకునే వారికి పెసలు ఒక అద్భుతమైన ఆహారం. ముడి పెసళ్లను రోజూవారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల పొట్ట నిండిన అనుభూతి కలుగుతుంది, తద్వారా ఆకలిని నియంత్రిస్తుంది. ఇది బరువును తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది. రాత్రిపూట ఒక కప్పు మూంగ్ దాల్ను చపాతీలతో కలిపి తీసుకోవడం బరువు తగ్గాలనుకునే వారికి ఎంతో ప్రయోజనకరమని పరిశోధకులు సూచిస్తున్నారు. అంతేకాకుండా, బియ్యంలో కొద్దిగా పెసలు కలిపి పులగం చేసుకుని తినడం వల్ల అద్భుతమైన రీతిలో బరువు తగ్గొచ్చని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

గుండె ఆరోగ్యం - రక్తపోటు నియంత్రణ: పెసలు అధిక రక్తపోటును తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. వీటిలో ఉండే ప్రత్యేక గుణాలు రక్తపోటు స్థాయిలను అదుపులో ఉంచుతాయి. అంతేకాదు, శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించడంలో పెసలు కీలక పాత్ర పోషిస్తాయి. పెసళ్లలో ఉండే సోడియం ఈ ప్రయోజనాలకు ఎంతగానో సహాయపడుతుందని తెలుస్తోంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచి, గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల శరీరం ఆరోగ్యంగా, చురుకుగా ఉండటానికి దోహదపడుతుంది.

పెసలను వీటిని పులగం, పెసర దోస, మొలకెత్తిన పెసలు వంటి వివిధ రూపాల్లో తీసుకోవచ్చు. పెసల దోస రుచికరమైనది.. మొలకెత్తిన పెసలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. మొత్తంమీద, పెసలు రుచిని, ఆరోగ్యాన్ని ఒకేచోట అందిస్తాయి.. (అయితే.. ఏమైనా అనారోగ్య సమస్యలుంటే నేరుగా ఆరోగ్య నిపుణులను సంప్రదించడం చాలా మంచిది.)





