☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
చుక్క నూనె లేకుండా నోరూరించే చిల్లీ చికెన్.. రుచిలో మాత్రం తగ్గేదేలే • కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం • ఒకనాడు ఆటో ఎక్కనివ్వలేదని.. నేడు నాలుగు ఆటోలతో ఉచిత ప్రయాణం అందిస్తున్న ట్రాన్స్‌ జెండర్ • ఒమేగా 3 పుష్కలంగా ఉండి..గుండెకు మేలు చేసే బెస్ట్ చేపలు ఇవే! • Moral Stories: వ్యాపారిని ఉరి తీయాలనుకున్న రాజు.. రాజు చావు కోరిన వ్యాపారి.. • చలికాలంలో వేడివేడిగా, రెస్టారెంట్ రుచితో 30 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే.. • 106 రోజుల పాటు కుజ సంచారం.. సింహంతో సహా ఆ 5 రాశులకు ధన, కీర్తి యోగం! • శివ యోగం ప్రభావంతో ఈ రాశులకు ఈరోజు భారీ లాభాలు! •

నేడు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

Heavy Rain : తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు...
నేడు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

Heavy Rain : తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, విశాఖపట్నం, ఎన్టీఆర్, అనకాపల్లి, కృష్ణా మరియు పోలవరం ప్రాంతాల్లోని పాఠశాలలకు ఇవాళ (నేడు) సెలవు ప్రకటిస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. వర్షాల తీవ్రత దృష్ట్యా పిల్లలు, తల్లిదండ్రులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే ఈ ముందస్తు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

Read Also : ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలు.. పలు విమానాల దారి మళ్లింపు

Gurukula School Incident
Gurukula School Incident

హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో గణేశ్ నిమజ్జన సెలవు

మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో గణేశ్ నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా జరుగుతున్న శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమాలను పురస్కరించుకుని ప్రభుత్వం ప్రత్యేక సెలవు ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ట్రాఫిక్ ఆంక్షలు, రద్దీని పరిగణనలోకి తీసుకుని హైదరాబాద్, రంగారెడ్డి మరియు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లోని అన్ని పాఠశాలలు, కళాశాలలు మరియు ప్రభుత్వ కార్యాలయాలకు ఇవాళ సెలవు ఇచ్చారు. నిమజ్జనోత్సవం ప్రశాంతంగా, సురక్షితంగా ముగిసేలా మరియు ప్రజలకు రవాణా పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం .

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

⬇ Full News JPG⬇ Short News JPG
← కరవు తీర్చిన వర్షాలునన్ను ఎనౌకౌంటర్ చేస్తారేమో – వాంగుక్ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com