☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

December Fight : డిసెంబర్ లో మిడ్ రేంజ్ హీరోల ఫైట్.. ఒకే రోజు నాలుగు సినిమాలు..

ఓ నలుగురు మిడ్‌రేంజ్‌ హీరోలు.. బాక్సాఫీస్ బరిలో పోటీకి సిద్ధమవుతున్నారు. (December Fight)
December Fight : డిసెంబర్ లో మిడ్ రేంజ్ హీరోల ఫైట్.. ఒకే రోజు నాలుగు సినిమాలు..

December Fight : డిసెంబర్‌ రేస్‌ నుంచి ప్రభాస్‌ పాన్‌ ఇండియా మూవీ ఫౌజీ అఫీషియల్‌గా తప్పుకుంది. దీంతో ఈ అడ్వాంటేజ్‌ని వాడుకునేందుకు ఓ నలుగురు మిడ్‌రేంజ్‌ హీరోలు.. బాక్సాఫీస్ బరిలో పోటీకి సిద్ధమవుతున్నారు.

కొంతకాలంగా మాస్, యాక్షన్ జోనర్‌లో సినిమాలు చేసి వరుస ఫెయిల్యూర్స్‌ చూసిన నితిన్ రూట్‌ మార్చారు. నాని నిర్మాతగా అలియాస్ రుక్మిణి సినిమా చేస్తున్న నితిన్‌ తిరిగి ఫ్యామిలీ ఆడియెన్స్‌కి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. దండోరా ఫేమ్‌ డైరెక్టర్ మురళీకాంత్‌ తెరకెక్కిస్తున్న అలియాస్‌ రుక్మిణి సినిమా రిలీజ్‌ డేట్‌ని అఫీషియల్‌గా ప్రకటించారు మేకర్స్. ఈ సినిమా డిసెంబర్ 4న థియేటర్స్‌లోకి వస్తుందని.. నితిన్‌ స్పెషల్‌ పోస్టర్‌తో క్లారిటీ ఇచ్చారు.

ప్రభాస్‌ పాన్‌ ఇండియా సినిమా ఫౌజీ వాయిదా అంటూ రూమర్స్‌ వినిపించినప్పుడే వృషకర్మ సినిమా విడుదల తేదీని అఫీషియల్‌ చేసేశారు నాగచైతన్య. పాన్‌ ఇండియా సినిమాగా కార్తీక్‌ వర్మ దండు తెరకెక్కిస్తోన్న వృషకర్మ డిసెంబర్‌ 4నే థియేటర్స్‌లోకి వస్తుంది. మిథికల్‌ థ్రిల్లర్‌ కాన్సెప్ట్‌తో వస్తోన్న వృషకర్మ సినిమాపై భారీ అంచనాలు క్రియేటవుతున్నాయి. కానీ ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ టైం పడుతుండటంతో చెప్పిన డేట్ కి వస్తుందా అనే సందేహం నెలకొంది.

Also Read : Bigg Boss Today Promo : బిగ్ బాస్ వీకెండ్ ప్రోమో వచ్చేసింది.. నాగార్జున ఫైర్.. ఏడ్చేసిన ఝాన్సీ.. ప్రోమో వైరల్..

అదే రోజు ఇటీవల మలయాళం కంటే తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేస్తున్న మలయాళం హీరో దుల్కర్ సల్మాన్‌ సినిమా శ్రీశ్రీ కూడా రాబోతుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కుతోన్న శ్రీశ్రీ సినిమా డిసెంబర్‌ 4నే విడుదల కాబోతుంది. కాకపోతే ఈ సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయనే తెలుస్తుంది.

ఈ లిస్ట్ లో నాగ చైతన్య, దుల్కర్ సల్మాన్‌, నితిన్‌ కంటే ముందుగా టార్గెట్‌ ఫిక్స్‌ చేసుకున్న హీరో విశ్వక్‌ సేన్. తండ్రి-కొడుకు మధ్య జరిగే పవర్ఫుల్ పొలిటికల్‌ యాక్షన్‌ డ్రామాగా లెగసీ అనే సినిమాతో డిసెంబర్‌ 4న రాబోతున్నట్టు ఎప్పుడో ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన లెగసీ టీజర్‌ సైతం సినిమాపై అటెన్షన్‌ క్రియేట్‌ చేసింది. ప్రస్తుతానికి అయితే ఈ సినిమాపై అంతగా బజ్ లేదు. మరి రిలీజ్ సమయానికి ఏమన్నా ఆసక్తి నెలకొంటుందో చూడాలి.

మరి డిసెంబర్‌ ఫస్ట్‌ వీక్‌లో ఒకే రోజు బాక్సాఫీస్‌ బరిలో పోటీకి రెడీ అవుతున్న ఈ మిడ్‌ రేంజ్‌ హీరోలు ఏ రేంజ్‌ సక్సెస్‌ అందుకుంటారో చూడాలి.

Also See : Mangli : ఎంగిలిపూల బతుకమ్మ .. స్పెష‌ల్ ఫోటోల‌ను షేర్ చేసిన సింగ‌ర్ మంగ్లీ..

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Vivo T5x 5G Deal : ఇది కదా డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 46వేల వివో 5G ఫోన్‌ జస్ట్ రూ. 23వేలకే..!Singer Jhansi Bigg Boss Promo : బిగ్ బాస్ వీకెండ్ ప్రోమో వచ్చేసింది.. నాగార్జున ఫైర్.. ఏడ్చేసిన ఝాన్సీ.. ప్రోమో వైరల్.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com