ప్రముఖ సీనియర్ నటుడు నానా పటేకర్ మరణం సినీ ప్రపంచాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఆయన ఇక లేరనే వార్త అభిమానులను తీవ్రంగా కలచివేస్తోంది. అయితే ఆయన కన్నుమూయడానికి కేవలం మూడు రోజుల ముందు మాట్లాడిన మాటలు ఇప్పుడు అందరినీ భావోద్వేగానికి గురిచేస్తున్నాయి. జీవితం, మరణం గురించి ఆయన పంచుకున్న ఆలోచనలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అక్టోబర్ 4న గోవాలో జరిగిన ఓ కార్యక్రమంలో నానా పటేకర్ పాల్గొన్నారు. ఆ వేదికపై ఆయన మరణం గురించి మాట్లాడారు. ‘‘మనమందరం ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచి వెళ్లాల్సిందే. రేపు నేను ఇక్కడ ఉంటానో లేదో నాకే తెలియదు. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఆ సమయం వస్తుంది’’ అని ఆయన పేర్కొన్నారు. ఆ సమయం రాకముందే అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ప్రయత్నించాలని ఆయన పిలుపునిచ్చారు.
నానా పటేకర్ మరణం గురించి గతంలోనూ ఎంతో నిర్భయంగా మాట్లాడేవారు. చావు అంటే తనకు ఎలాంటి భయం లేదని ఆయన స్పష్టం చేశారు. తన అంత్యక్రియల కోసం 12 మణుగుల కట్టెలను కూడా దాచి ఉంచినట్లు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. వాటితోనే తన దహన సంస్కారాలు చేయాలని కోరారు. ఆ కట్టెలను ఎండబెట్టి ఉపయోగించాలని, తడి కట్టెల వల్ల వచ్చే పొగతో స్నేహితుల కళ్లలో నీళ్లు రాకూడదని ఆయన సున్నితంగా వివరించారు.
వెండితెరపై విలక్షణ నటనతో మెప్పించిన నానాజీకి క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీకి ఆయన వీరాభిమాని. కోహ్లీ మ్యాచ్‌లో త్వరగా ఔట్ అయితే తనకు రోజంతా భోజనం కూడా సహించేది కాదని గతంలో చెప్పారు. ఇలాంటి ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చి ఆయన అనంత లోకాలకు వెళ్లిపోయారు. ఆయన మృతికి సినీ, రాజకీయ ప్రముఖులు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నారు.
The post ‘రేపు ఉంటానో లేదో’.. నానా పటేకర్ చివరి మాటలు! appeared first on Adya News Telugu.






