☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కాక్రోచ్ పార్టీ 2.0 అట్టర్ ఫ్లాప్ : ఎగతాళి చేస్తున్న బీజేపీ • Weather Report: తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. రాబోయే 3 రోజుల వాతావరణ ఎలా ఉండబోతుందంటే? • విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న సుస్మిత కొణిదెల • న్యాయవాదుల నిర్బంధంపై సీజేఐ జోక్యానికి SCBA విజ్ఞప్తి • Penguins: పెరుగుతున్న భూతాపం.. పిట్టల్లా రాలిపోతున్న పెంగ్విన్లు.. • నితిన్ కొత్త సినిమాలో..రుక్మిణీగా బాలీవుడ్ నటి? • తెలుగు అబ్బాయిలంటే ఇష్టం.. పెళ్లి కూడా చేసుకుంటా..! హీరోయిన్ క్రేజీ కామెంట్స్ • కాక్రోచ్ పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే నాయనమ్మ కన్నుమూత •

Nani | నాని ‘ప్యారడైజ్’ ప్రీమియర్‌కు అనుమతి ల‌భించింది.. కాని ఇక్క‌డే అస‌లైన ట్విస్ట్..!

Nani | నేచురల్ స్టార్ నాని హీరోగా, యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ‘ది ప్యారడైజ్’ సినిమా విడుదలకు సిద్ధమైంది. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు ఒక రోజు ముందుగానే, సెప్టెంబర్ 23న ప్రత్యేక ప్రీమియర్ షోలు నిర్వహించనున్నారు.
Nani | నాని ‘ప్యారడైజ్’ ప్రీమియర్‌కు అనుమతి ల‌భించింది.. కాని ఇక్క‌డే అస‌లైన ట్విస్ట్..!

Nani | నేచురల్ స్టార్ నాని హీరోగా, యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ‘ది ప్యారడైజ్’ సినిమా విడుదలకు సిద్ధమైంది. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు ఒక రోజు ముందుగానే, సెప్టెంబర్ 23న ప్రత్యేక ప్రీమియర్ షోలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఓ థియేటర్‌లో ప్రేక్షకులతో కలిసి తన సినిమాను చూడాలన్న నాని కోరిక ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ విషయంపై నాని చేసిన ప్రత్యేక విజ్ఞప్తికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు.సెప్టెంబర్ 23న ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో జరిగే ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్ షోకు హాజరై, ప్రేక్షకులతో కలిసి సినిమా చూడాలని నాని ముఖ్యమంత్రిని, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని, తెలంగాణ పోలీసు అధికారులను కోరారు.

చిన్నప్పటి నుంచి సినిమాలను ప్రేక్షకులతో కలిసి థియేటర్లలో చూడటం తనకు ఎంతో ఇష్టమని, హైదరాబాద్‌లో ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌కు ప్రత్యేకమైన సినిమా అనుభూతి ఉందని నాని తన సందేశంలో పేర్కొన్నారు. ఒక సినిమా చేసిన తర్వాత థియేటర్‌లో ప్రేక్షకుల మధ్య కూర్చొని వారి స్పందనను ప్రత్యక్షంగా చూడటంలోనే అసలైన సంతృప్తి ఉంటుందని నాని తెలిపారు. అయితే తన పర్యటన సందర్భంగా అమల్లో ఉన్న అన్ని భద్రతా నిబంధనలు, అవసరమైన మార్గదర్శకాలను తప్పకుండా పాటిస్తామని స్పష్టం చేశారు. ప్రజల భద్రతకే తమ తొలి ప్రాధాన్యం ఉంటుందని చెబుతూ, తన విజ్ఞప్తిని పరిశీలించాలని ప్రభుత్వాన్ని కోరారు. నాని విజ్ఞప్తిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. భద్రతా మార్గదర్శకాలను గౌరవిస్తూ ముందుకు వచ్చినందుకు నానికి అభినందనలు తెలిపారు. అలాగే ‘ది ప్యారడైజ్’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలను కూడా అభినందించారు. అయితే జనసమూహ నియంత్రణ, ప్రజా భద్రత వంటి అంశాలు అత్యంత ముఖ్యమైనవని సీఎం స్పష్టం చేశారు.

నాని స్థానిక పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా దరఖాస్తు చేసుకోవాలని సీఎం సూచించారు. ఆ దరఖాస్తును పరిశీలించిన అనంతరం అక్కడి పరిస్థితులు, భద్రతా ఏర్పాట్లను బట్టి పోలీసులు తగిన నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. దీంతో నాని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ప్రేక్షకులతో కలిసి ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్‌ను వీక్షించాలన్న కోరికకు సంబంధించి తదుపరి నిర్ణయం పోలీసుల పరిశీలనపై ఆధారపడి ఉండనుంది. విడుదలకు కొన్ని గంటల ముందు చోటుచేసుకున్న ఈ పరిణామం సినిమాపై ఉన్న ఆసక్తిని మరింత పెంచింది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Vande Mataram | మనస్సాక్షికి వ్యతిరేకంగా వందేమాతరం పాడలేమన్న వారిని శిక్షించలేం: సుప్రీంకోర్టుJurala project | జూరాల గేట్లు ఎత్తడం రైతుల విజయం : మర్రి జనార్దన్ రెడ్డి →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com