The Paradise first day collection : నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం ది ప్యారడైజ్. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కయాదు లోహర్ కథానాయిక. మోహన్ బాబు, సోనాలి కుల్‌కర్ణి, ఈశ్వరీ రావు, సంపూర్ణేశ్ బాబు, తనికెళ్ల భరణి కీలక పాత్రల్లో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించగా.. ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఇక ఈ చిత్రం భారీ అంచనాల మధ్య నిన్న (సెప్టెంబర్ 24)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతకముందు రాత్రి అంటే సెప్టెంబర్ 23వ తేదీన పలు చోట్ల ప్రీమియర్లు వేశారు. కాగా.. తొలి రోజు ఈ చిత్రం భారీ కలెక్షన్లు సాధించింది. ఏకంగా 88 కోట్లకు పైగా గ్రాస్ ను సాధించింది.

ఈ విషయాన్ని చిత్ర బృందం ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా వెల్లడించింది. అయితే.. ఇందులో తొలి రోజుతో పాటు ప్రీమియర్ కలెక్షన్లు కూడా ఉన్నాయి. నాని కెరీర్‌లో తొలి రోజు వసూళ్లలో ఇవే అత్యధిక వసూళ్లు.
ఇక నేడు గణేష్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో సెలవు కాగా.. రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం కావడంతో ఈ చిత్ర వసూళ్లు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
A BLOCKBUSTER BEGINNING TO JADAL ZAMANA
#TheParadise collects 88 CRORES+ GROSS WORLDWIDE on Day 1
Enter the Jadal Zamana. Experience the madness.
Book your tickets now!
https://t.co/XTkG9ueWdv
Natural Star @NameisNani in an @odela_srikanth cinema
An… pic.twitter.com/M44KX0D9qe— SLV Cinemas (@SLVCinemasOffl) September 25, 2026








