☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

నాని 'ప్యారడైజ్' బాక్సాఫీస్ అంచనాలు తారుమారు.. రెండో రోజే దారుణంగా పడిపోయిన కలెక్షన్స్!

నాని 'ప్యారడైజ్' బాక్సాఫీస్ అంచనాలు తారుమారు.. రెండో రోజే దారుణంగా పడిపోయిన కలెక్షన్స్!
నాని 'ప్యారడైజ్' బాక్సాఫీస్ అంచనాలు తారుమారు.. రెండో రోజే దారుణంగా పడిపోయిన కలెక్షన్స్!
నాని 'ప్యారడైజ్' బాక్సాఫీస్ అంచనాలు తారుమారు.. రెండో రోజే దారుణంగా పడిపోయిన కలెక్షన్స్!

నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'ప్యారడైజ్'. విడుదలైన మొదటి రోజు ( సెప్టెంబర్ 24 ) బాక్సాఫీస్‌ను ఊపేసిన ఈ చిత్రం.. రెండో రోజుకి వచ్చేసరికి ఊహించని రీతిలో భారీ డ్రాప్‌ను చవిచూసింది. నాని సరికొత్త రగ్గడ్ లుక్, అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, అంతకుముందు వచ్చిన 'దసరా' క్రేజ్ కలసి ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచేశాయి.

అంచనాలు తారుమారు..

తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 88 కోట్ల మేర గ్రాస్ రాబట్టి గ్రాండ్ ఓపెనింగ్స్ సాధించింది 'ప్యారడైజ్' మూవీ. నానీ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ రికార్డు సృష్టించింది. కానీ రెండవ రోజు మాత్రం సుమారు రూ. 26 కోట్ల గ్రాస్‌కే పరిమితమైంది. దీంతో రెండు రోజుల్లో కలిపి వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రం రూ. 114 కోట్లు రాబట్టినట్లు మూవీ టీమ్ ప్రకటించింది. అయితే వారు ఊహించిన అంచనాలన్నీ తారుమారైయ్యాయి.

ఈ 'ప్యారడైజ్' మూవీ తెలంగాణ (నైజాం)లో రూ. 9 కోట్ల గ్రాస్ వసూలు చేసి కొంతవరకు నిలదొక్కుకున్నప్పటికీ.. ఆంధ్రా, ఓవర్సీస్ మార్కెట్లలో టాక్ బాగోకపోవడంతో వసూళ్లు దారుణంగా పడిపోయాయి. సినిమాలోని లాజిక్స్, మితిమీరిన వైలెంట్ సీన్లు , సెకండాఫ్ నరేషన్‌పై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చలు, నెగెటివ్ రివ్యూలు రావడం వల్ల ఈ ఊహించని డ్రాప్ కనిపించింది.

ట్రోల్స్‌పై నాని క్రేజీ రియాక్షన్...

ఈ మిశ్రమ స్పందనలు, నెగెటివిటీపై నాని సోషల్ మీడియా వేదికగా చాలా స్పోర్టివ్‌గా స్పందించారు. "మీ ప్రేమను ఎంతగా స్వీకరించానో, మీ హిల్లేరియస్ ట్రోల్స్‌ను కూడా అంతే ఎంజాయ్ చేశాను. విమర్శకులు వేలెత్తి చూపిన తప్పుల నుంచి నేర్చుకున్నాను. రక్తం, చెమట చిందించి ఈ సినిమా తీశాం. మీరు ఆదరించినా, విమర్శించినా అదంతా మీకే వదిలేస్తున్నా" అని రాసుకొచ్చారు.

ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ , IVY ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాతలు సుధాకర్ చెరుకూరి, ఇషాన్ సక్సేనా భారీ బడ్జెట్‌తో నిర్మించాయి. ఈ శని, ఆదివారాల్లో కలెక్షన్లు పుంజుకోకపోతే.. భారీ నష్టాలను చవిచూసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరి వీకెండ్‌లో 'ప్యారడైజ్' ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో వేచి చూడాలి.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← సీజేపీ అల్టిమేటంతో దిగొచ్చిన ఈసీ... సెప్టెంబర్ 27న ఢిల్లీలో స్పెషల్ క్యాంపులు..క్రెడిట్ కార్డ్ బిల్లు ఎక్కువ వచ్చిందా ? ఇలా చేస్తే ఒక్క రూపాయి కట్టక్కర్లేదు! డబ్బులు రీఫండ్ వచ్చే ఛాన్స్ ! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com